బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bhola Shankar) భారీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమా వాల్తేరు వీరయ్య(Waltair veerayya) లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమానే అయినా…
పెద్దగా బజ్ ను సొంతం చేసుకోలేక పోయిన సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఓవరాల్ బుకింగ్స్ నిరాశ పరిచాయి. ఇక రిలీజ్ రోజున ఓవర్సీస్ ప్రీమియర్స్ లో 310K మార్క్ ని అందుకోగా జైలర్ తో సిమిలర్ లోకేషన్స్ లోనే రిలీజ్ అయినా కూడా ఓపెనింగ్స్ చాలా నిరాశ పరిచాయి.
ఇక తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ షోలకు కొన్ని చోట్ల ఫుల్స్ పడ్డాయి కానీ చాలా చోట్ల ఆక్యుపెన్సీ 50-60% రేంజ్ లోనే ఆక్యుపెన్సీతో ఓపెన్ అవ్వగా మ్యాట్నీ షోల నుండి హోల్డ్ జస్ట్ ఓకే అనిపించే విధంగానే ఉండగా ఆల్ మోస్ట్ సినిమా ఓపెనింగ్స్…
లాస్ట్ ఇయర్ వచ్చిన గాడ్ ఫాదర్ కి కొంచం అటూ ఇటూగా సిమిలర్ గానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా బుకింగ్స్ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు…
తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 12-13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా నైట్ షోలలో ఏమైనా అద్బుతం జరిగితే ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మెగాస్టార్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అద్బుతాళను సృష్టించిన అవసరం ఎంతైనా ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.