బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) సినిమా రెండు వారాలను పూర్తి చేసుకోగా పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది అనుకున్నారు అందరూ…
కానీ భోలాశంకర్(Bholaa Shankar) అట్టర్ ఫ్లాఫ్ ఎఫెక్ట్ తో థియేటర్స్ ఫీడింగ్ కోసం తిరిగి బ్రో ది అవతార్ కి కొన్ని షోలను వేస్తూ ఉండగా సండే రోజు కొంచం పర్వాలేదు అనిపించిన సినిమా ఆగస్ట్ 15న మాత్రం రిలీజ్ అయిన 19 వరోజు కొన్ని సెంటర్స్ లో…
హౌస్ ఫుల్ బోర్డులు పడటం విశేషం అని చెప్పాలి. హైదరాబాదు లో 15 లోపు షోలు నైట్ టైంలో పెడితే అందులో కొన్ని షోలలో 60% రేంజ్ ఆక్యుపెన్సీ అలాగే కొన్ని షోలు హౌస్ ఫుల్స్ కూడా రిపోర్ట్ అయ్యాయి. ఇక వైజాగ్ లో కూడా కొన్ని షోలు పెట్టగా ఆ షోలకు…
బెటర్ ఆక్యుపెన్సీ లభించింది… ఉన్నంతలో 2 వారాల తర్వాత రన్ లో బ్రో మూవీకి తిరిగి 19 వ రోజు చాలా లిమిటెడ్ థియేటర్స్ లో కొంచం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం కానీ ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం సినిమా సాధించే ఏ కలెక్షన్స్ కూడా…
బ్రేక్ ఈవెన్ ని దరిదాపుల్లో కూడా వెళ్ళడానికి సరిపోవు అనే చెప్పాలి. కానీ సినిమా ని కొంచం కేర్ తీసుకుని మరింత బాగా తీసి ఉన్నా ఆడియన్స్ కి సినిమా ఎక్కువ నచ్చినా కూడా ఇండిపెండెన్స్ వీకెండ్ లో ఈ సినిమా కూడా జోరు చూపించి ఉండేది. కానీ ఓవరాల్ గా నిరాశ పరిచే రిజల్ట్ తోనే పరుగును పూర్తి చేసుకోబోతుంది.