ఏ నిర్మాత అయినా సినిమాల పబ్లిసిటీ కోసం వచ్చిన కలెక్షన్స్ కన్నా అప్పుడప్పుడు తమ సినిమాల వసూళ్లు ఎక్కువగా చూపించుకుంటూ ఉంటారు. గ్రాస్ పోస్టర్ లు ట్రేడ్ వాళ్ళు ఒక లెక్క వేస్తె మేకర్స్ పోస్టర్స్ లో లెక్కలు ఎక్కువగా ఉంటూ వస్తాయి. కొంతమంది మాత్రం వచ్చిన కలెక్షన్స్ ని…
అలాగే పబ్లిష్ చేస్తూ ఉంటారు…లేటెస్ట్ గా దీనికి పూర్తి విరుద్దంగా కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) కి మొదటి వారంలో ట్రేడ్ లెక్కలు ఒకలా ఉంటే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ లో లెక్కలు ఒకలా ఉన్నాయి.
ట్రేడ్ లెక్కల్లో సినిమా 415 కోట్ల నుండి 430 కోట్ల రేంజ్ దాకా వేరి సోర్స్ ప్రకారం వాళ్ళు కలెక్షన్స్ ని అప్ డేట్ చేయగా ఇప్పుడు మేకర్స్ మాత్రం మొదటి వారంలో 375 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుందని అనౌన్స్ చేశారు. అంటే ట్రేడ్ లెక్కలు 425 కోట్ల రేంజ్ లో ఉంటే…
మేకర్స్ రిలీజ్ చేసిన లెక్క 50 కోట్లు తక్కువగా ఉంది. కానీ ఓవర్సీస్ లో ట్రాక్ చేసిన గ్రాస్ 18.5 మిలియన్ డాలర్స్ దాకా ఉండగా ఇండియన్ కరెన్సీలో ఆ లెక్క 153 కోట్ల దాకా ఉంది. ఇక తమిళనాడులో 123 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్లు, కర్ణాటకలో 47 కోట్లు,
కేరళలో 36 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్లకు పైగా గ్రాస్ ఉండగా ఈ లెక్కలే టోటల్ గా 425 కోట్ల దాకా ఉంది, కానీ మేకర్స్ 375 కోట్ల పోస్టర్ ను రిలీజ్ చేసి ఇంకా కౌంటింగ్ జరుగుతుందని అనౌన్స్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఈ లెక్కలు చూసి…
ఇలా తక్కువ వసూళ్ళని పోస్టర్ లో రిలీజ్ చేయడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో నిర్మాతలపై మండిపడుతున్నారు… చాలా వరకు మేకర్స్ కలెక్షన్స్ పోస్టర్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తారు కానీ ఇక్కడ టోటల్ రివర్స్ లో 50 కోట్లు తక్కువగా రిపోర్ట్ చేయడం బహుశా హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ రేంజ్ లో…మరి దీనిపై మేకర్స్ ఏమంటారో చూడాలి.