Home న్యూస్ చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్….టాలీవుడ్ చరిత్రలో ఒకే ఒక్కడు!!

చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్….టాలీవుడ్ చరిత్రలో ఒకే ఒక్కడు!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప ది రైజ్(Pushpa The Rise) సినిమా 2021 డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ముందు మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కానీ తర్వాత మాత్రం అద్బుతమైన రన్ ని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో ఊహకందని విజయాన్ని నమోదు చేసింది.

తెలుగు లో ఆ టైం టికెట్ రేట్స్ వలన ఇబ్బందులు తలెత్తినా కూడా హిందీలో ఊచకోత కోయడం కలిసి వచ్చి హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా కి గాను ఇప్పుడు అల్లు అర్జున్ ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు…

2021 ఇయర్ కి గాను నేషనల్ అవార్డులను అనౌన్స్ చేయగా అల్లు అర్జున్ కి ఏకంగా బెస్ట్ యాక్టర్ ఆఫ్ 2021 ఇయర్ గా నేషనల్ అవార్డ్ పుష్ప సినిమా కి సొంతం చేసుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను ఇప్పుడు సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి…

టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరో కూడా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డును సొంతం చేసుకోలేదు… చరిత్రలో మొదటి సారిగా అల్లు అర్జున్ ఎపిక్ రికార్డ్ ను సృష్టించి పుష్ప పార్ట్ 1 సినిమా తో అవార్డ్ ను గెలుచుకుని ఊచకోత కోయగా….

ఈ అవార్డ్ తో సినిమా పార్ట్ 2 పై మరింత అంచనాలు పెరిగి పోవడం ఖాయమని చెప్పాలి. వచ్చే ఏడాది పార్ట్ 2 ఎప్పుడు వచ్చినా కూడా ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here