బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన రజినీకాంత్(Rajinikanth) జైలర్ మూవీ(Jailer) మిగిలిన ఏరియాల్లో ఎక్స్ లెంట్ గా థియేటర్స్ ని హోల్డ్ చేయగా…
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ వీక్ లో రిలీజ్ అయిన కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన థియేటర్స్ ని భారీగా కోల్పోవాల్సి వచ్చింది. సినిమా మొత్తం మీద రెండో వారంలో 650 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తే మూడో వారంలో కొత్త సినిమాల వలన…
కేవలం 150 థియేటర్స్ ని మాత్రమే ఇచ్చారు… దాంతో కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనుకున్నా ఉన్న థియేటర్స్ లోనే మంచి జోరుని చూపిస్తున్న సినిమా ఇప్పుడు కొత్త సినిమాల టాక్ అండ్ రిజల్ట్ ల కారణంగా థియేటర్స్ ని సాలిడ్ గా పెంచుకుని దుమ్ము లేపుతుంది…
కొత్త సినిమాలలో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ పడుతున్న థియేటర్స్ లో తిరిగి ఇప్పుడు జైలర్ మూవీని ప్రదర్శిస్తూ ఉండగా షోలు, స్క్రీన్స్ లు పెరుగుతూ దూసుకు పోతున్న జైలర్ ఇప్పుడు 250 కి పైగా థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది…
దాంతో బాక్స్ అఫీస్ దగ్గర ఖుషీ వచ్చే వరకు కూడా జైలర్ హావా కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. దాంతో లాంగ్ రన్ లో సినిమా కలెక్షన్స్ ఇలానే కొనసాగి భారీ లాభాలతో ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.