Home న్యూస్ జైలర్ సినిమా కి రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!!

జైలర్ సినిమా కి రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!!

0

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….

600 కోట్ల మమ్మోత్ కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు పెడుతూ దుమ్ము లేపుతుంది. జైలర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు సూపర్ స్టార్ రజినీ… అన్ని రాష్ట్రాల్లో సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రికార్డులను సృష్టించగా….

హిందీలో గదర్2 సినిమా హవా వలన అనుకున్న రేంజ్ లో ఆడలేదు… అక్కడ కూడా మినిమం జోరు చూపించినా కూడా సినిమా కలెక్షన్స్ రాంపేజ్ ఇంకా ఎక్కువగా ఉండేది. ఇక ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ఓవరాల్ గా ఎంతవరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు అన్నది….

Jailer Movie 19 Days Total WW Collections!

ఆసక్తిగా మారగా ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తాల ప్రకారం సినిమా ఒప్పుకున్నప్పుడు 80 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ తో ఈ సినిమాను రజినీకాంత్ సైన్ చేశారని సమాచారం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయితే అందులో ప్రాఫిట్ షేర్ కూడా ఉంటుందట…

రీసెంట్ గా సినిమా నిర్మాత కళానిధి మారన్ స్వయంగా లాభాలలో వచ్చిన అమౌంట్ ని రజినీకాంత్ కి ఇస్తూ ఫోటోని షేర్ చేశారు. సినిమా లాభాల్లో క్లియర్ వాటా ఎంత అనేది క్లియర్ గా చెప్పకున్నా ఈజీగా 15% రేంజ్ లో ఉంటుందని అంచనా… సినిమా టోటల్ షేర్ 280 కోట్లకు పైగా ఉండగా…

అందులో 40 కోట్లకు పైగా రజినీకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఆ లెక్కన ఈ సినిమా తో రజినీకాంత్ ఓవరాల్ గా ఈ సినిమా కోసం 120 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుని ఉండొచ్చని చెప్పాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here