సందీప్ కిషన్ కెరీర్ లో 25 వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ A1 ఎక్స్ ప్రెస్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన నాప్టే తునై రీమేక్ గా తెరకెక్కగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది, మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే… తన మావయ్య ఊరు అయిన యానం కి వెళ్ళిన హీరో కి అక్కడ హాకీ ప్లేయర్ లావణ్య ని చూసి లవ్ చేయడం తర్వాత లావణ్య కూడా లవ్ చేయడం జరుగుతుంది.
కానీ ఆ ఊర్లో ఉండే ఫేమస్ గ్రౌండ్ ని కాపాడుకోవాల్సిన టైం లో హీరో వాళ్ళకి ఎలా హెల్ప్ చేశాడు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సినిమా కథ.. పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్ కిషన్ బాగా పరిణితి చెందిన నటనతో మెప్పించగా ప్రస్థానం సినిమా తర్వాత ఆ రేంజ్ లో నటనకి స్కోప్ ఉన్న పాత్రతో మెప్పించాడు. లావణ్య త్రిపాటి రోల్ చిన్నదే అయినా తను కూడా మెప్పిస్తుంది. మిగిలియన యాక్టర్స్ బాగానే నటించారు.
ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బాగా ప్లస్ అయింది, సాంగ్స్ బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగున్నాయి, రీమేక్ సినిమా కాబట్టి ఓవర్ ప్రయోగాలు చేయకుండా సీన్ టు సీన్ ని నీట్ గా బాగా హ్యాండిల్ చేశారు.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా సినిమాటోగ్రఫీ అదిరిపోయింది, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే… సినిమా ఒరిజినల్ చూసిన వాళ్లకి…
కొంచం స్లో అయిన ఫీలింగ్ లాంటివి కలుగుతుంది కానీ చూడని వాళ్లకి కొన్ని కొన్ని సీన్స్ కొంచం సిల్లీగా అనిపించినా ఓవరాల్ గా బాగా ఆకట్టుకునే సినిమా A1 ఎక్స్ ప్రెస్…. కెరీర్ లో 25వ సినిమా కి పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని అంచనాలను అందుకున్నాడు సందీప్ కిషన్.. విజువల్స్, స్టొరీ పాయింట్, హీరో ఫ్లాష్ బ్యాక్, ఇంటర్వెల్ ముందు సీన్…ఇలా అక్కడక్కడ కొన్ని మంచి సీన్స్ పడటం తో సినిమా…
మొదటి నుండి అంచనాలను తగ్గట్లుగానే సాగుతూ ఎమోషనల్ టచ్ ఉన్న క్లైమాక్స్ తో బాగుంది అనిపించేలా ముగుస్తుంది, మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంది సినిమా… ఒరిజినల్ మేం చూశాం కాబట్టి కొంచం ఇంపాక్ట్ తగ్గినట్లు అనిపించింది కానీ ఫస్ట్ టైం చూసేవాళ్లకి బాగానే నచ్చుతుంది, సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్..