యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ A1 ఎక్స్ ప్రెస్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ నే ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మొదటి రోజు పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని మొత్తం మీద సొంతం చేసుకుంది. కానీ సినిమా సాధించిన బిజినెస్ ను అందుకోవాలి అంటే ఈ ఓపెనింగ్స్ సరిపోవు.
సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు భారత్ బంద్ కూడా మొదటి షోలకు కొద్దిగా ఇబ్బంది పెట్టింది, అయినా కానీ సినిమా మొత్తం మీద మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 76 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ లెక్క 79 లక్షల దాకా ఉంది.
మొత్తం మీద సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 24L
👉Ceeded: 8L
👉UA: 10L
👉East: 8L
👉West: 5.8L
👉Guntur: 7.2L
👉Krishna: 7.1L
👉Nellore: 5.5L(2L hires)
AP-TG Total:- 0.76CR (1.30Cr Gross~)
Ka+ROI: 2L
Os – 1L
Total WW: 0.79Cr(1.35cr Gross~)
ఇదీ మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్. సినిమాను టోటల్ గా 4.6 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మగా 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు మరో 4.21 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది.
టాక్ పాజిటివ్ గానే ఉండటం తో రెండో రోజు ఓపెనింగ్స్ బాగానే ఉండగా మొదటి రోజు లెవల్ లో రెండో రోజు కలెక్షన్స్ ఉంటాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది, మొత్తం మీద సినిమా హోల్డ్ చేస్తే మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు కానీ బిజినెస్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.