అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ సెట్ అవ్వడం లేదు, అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే అవ్వడం అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబో లో రెండు హిట్స్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడం క్రేజ్ బాగానే ఉన్నా అల్లు అర్జున్ ని సాటిస్ ఫై చేసేలా కథ ని పూర్తీ చేయలేక పోతున్నాడట త్రివిక్రమ్.
దాంతో ఫైనల్ స్టేజ్ కి వచ్చినా కానీ కథ పూర్తీ కాకపోవడం తో షూటింగ్ డిలే అవుతూనే ఉంది, ప్రస్తుతం ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఉగాది తర్వాత మొదలు అవుతుంది అంటున్నారు. ఫిబ్రవరి లోనే మొదలు అవ్వాల్సిన ఈ సినిమా కథ ఫైనల్ అవ్వక పోవడం వలన పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.
కానీ సినిమా మాత్రం ఇయర్ సెకెండ్ ఆఫ్ లో దసరా కి గాని లేక దీపావళి కి గాని టార్గెట్ చేసి రిలీజ్ చేయడం మాత్రం పక్కా అని అంటున్నారు. ఫ్యాన్స్ కూడా సినిమా ఈ ఇయర్ లోనే రావాలి అని కోరుకుంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.