రీసెంట్ టైంలో సీరియస్ మూవీస్ చేస్తూ వస్తున్న అల్లరి నరేష్(Allari Naresh) ఒకప్పుడు తనకి బాగా కలిసి వచ్చిన కామెడీ ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో మూవీ చేయాలనీ ఫిక్స్ అయ్యి చేసిన కొత్త సినిమా ఆ ఒక్కటీ అడక్కు(Aa Okkati Adakku Movie)…ప్రజెంట్ టైంలో కూడా మంచి కామెడీ మూవీస్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి….
సమ్మర్ లో మంచి ఆప్షన్ గా ఆ ఒక్కటీ అడక్కు నిలుస్తుందేమో అని ట్రైలర్ చూస్తె అనిపించింది. మరి ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే ఏజ్ అవుతున్నా పెళ్లి అవ్వని హీరోకి అనుకోకుండా హీరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది…పెళ్లి చేస్తాం అంటూ మోసం చేసే కొన్ని మాట్రిమోనియల్ కంపెనీలో చేసే మోసాన్ని….
హీరో ఎలా కనిపెట్టాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….సినిమా ట్రైలర్ చూశాక ట్రైలర్ లో ఉన్న కామెడీ సినిమాలో కూడా ఉంటే ఈజీగా వర్కౌట్ అవ్వడం ఖాయమేమో అనిపించింది….కానీ ట్రైలర్ లో చూపించిన కామెడీ తప్ప సినిమాలో పెద్దగా కామెడీనే వర్కౌట్ అవ్వలేదు….
మొదట్లో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా తర్వాత సినిమా కంప్లీట్ గా ట్రాక్ తప్పింది…ఇంటర్వెల్ పాయింట్ రొటీన్ గానే ఉండగా సెకెండ్ ఆఫ్ కథ సాగాదీసినట్లు అనిపించింది…. చాలా తిన్ స్టొరీ పాయింట్ తో వచ్చిన సినిమా ను అల్లరి నరేష్ కాపాడే ప్రయత్నం చేశాడు కథ బలంగా లేకపోవడంతో జస్ట్ ఓకే అనిపించాడు… కొన్ని సీన్స్ లో తన నటన కామెడీ బాగానే ఆకట్టుకోగా…
కథలోనే బలం లేక పోవడంతో తన కష్టం వృధా అయ్యింది…హీరోయిన్ ఫారియా పర్వాలేదు అనిపించింది…మిగిలిన యాక్టర్స్ తమ రోల్స్ వరకు పర్వాలేదు అనిపించారు. సంగీతం అంతగా సినిమాలో వర్కౌట్ అవ్వలేదు…పాటలు స్పీడ్ బ్రేకర్స్ లా అనిపించాయి…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మొదట్లో బాగున్నా తర్వాత పట్టు కోల్పోయారు…సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించగా డైరెక్టర్ ఎంచుకున్న కోర్ పాయింట్ బాగానే ఉన్నా కూడా…
చెప్పిన విధానం మాత్రం అనుభవం లేక పోవడంతో సరిగ్గా చెప్పలేక పోయాడు…కంప్లీట్ గా ఎంటర్ టైన్ మెంట్ వే లోనే కథ ని చెప్పి ఉంటే కొంచం బెటర్ గా ఉండేదేమో… మొత్తం మీద ఫస్టాఫ్ కొంత పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ మాత్రం ఆ ఒక్కటి అడక్కు సినిమా చాలా వరకు ట్రాక్ తప్పినట్లు అనిపించింది…
లైట్ కామెడీ ఎంటర్ టైనర్ చూద్దాం అనుకునే ఆడియన్స్ కొంచం ఓపిక చేసుకుని చూస్తె ఆ ఒక్కటీ అడక్కు కొంచం బోర్ ఫీల్ అయినా పర్వాలేదు అనిపించవచ్చు…కానీ అల్లరి నరేష్ నుండి ఒకప్పటి కామెడీ ఎంటర్ టైనర్ ను ఎక్స్ పెర్ట్ చేసి వెళితే మట్టుకు అంచనాలను అందుకోలేక పోయింది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్….