Home న్యూస్ ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ టాక్…మాస్…ఊరమాస్!!

ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ టాక్…మాస్…ఊరమాస్!!

1120
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ ఆడియన్స్ ముందుకు ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే రావాల్సింది కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ లాస్ట్ ఇయర్ నుండి థియేటర్స్ లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంటుంది అని అనేక చర్చలు జరిగి ఏమి సెట్ అవ్వక సినిమా రిలీజ్ మళ్ళీ ఆగిపోతూ ఆగిపోతూ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సినిమా థియేటర్స్ లో రిలీజ్ ను…

ఈ నెల 8 న పోటి లో సొంతం చేసుకోబోతుంది… ఈ సారి పక్కాగా ఆడియన్స్ ముందుకు వస్తుంది అంటున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా మళ్ళీ కొత్త కట్ తో లాంచ్ చేశారు. ఈ సారి ట్రైలర్ లో సినిమా స్టొరీ పాయింట్ ని ఆల్ మోస్ట్…

రివీల్ చేశారు అని చెప్పాలి. ట్రైలర్ లో అల్లరి చిల్లరగా ఏ పని లేకుండా ఇంట్లో ఫాదర్ ప్రకాష్ రాజ్ తో ఎప్పుడూ తిట్లు తింటూ కూర్చునే హీరో, హీరోయిన్ నయనతార తో లవ్ లో బిజీగా ఉండగా ప్రకాష్ రాజ్ మీద కొందరు విలన్స్ గొడవకి దిగడంతో….

ఆ గుండాలను కొట్టి హీరో తన ఫ్యామిలీ కి అండగా ఉంటాడు, ఇక అప్పటి నుండి విలన్ బ్యాచ్ హీరో ఫ్యామిలీని టార్గెట్ చేయడం హీరో వాటిని ఆపడం చివరికి ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటూ ట్రైలర్ లో చూపెట్టారు. కథగా చూస్తె ఎప్పుడో 90 దశకం నాటి కథని బి గోపాల్ తెరకెక్కించారు అనిపించింది కానీ యాక్షన్ సీన్స్ అండ్…

గోపీచంద్ మాస్ డైలాగ్స్ అలాగే ఎలివేషన్ లు బాగుండటం అండ్ క్వాలిటీ కూడా బాగుండటంతో మాస్ కట్ బాగుంది అనిపించింది, మరి జనాలు ఎంతవరకు ఈ ఓల్డ్ స్టొరీ ని చూడటానికి థియేటర్స్ కి వస్తారు అన్నది చూడాలి ఇక… ట్రైలర్ వరకు రొటీన్ కథనే అయినా కమర్షియల్ హంగులతో మెప్పించింది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here