Home న్యూస్ ఆరడుగుల బుల్లెట్ టోటల్ బిజినెస్, థియేటర్స్, బుకింగ్స్, డే 1 ఎంత రావొచ్చు!

ఆరడుగుల బుల్లెట్ టోటల్ బిజినెస్, థియేటర్స్, బుకింగ్స్, డే 1 ఎంత రావొచ్చు!

2499
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన 4 ఇయర్స్ ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ సినిమా ఎట్టకేలకు ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, సినిమా టోటల్ బిజినెస్ లెక్కలను రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం వినిపిస్తున్న లెక్కలను గమనిస్తే… తెలుగు రాష్ట్రాలలో ఓన్ రిలీజ్ అండ్ థర్డ్ పార్టీ బయర్స్ ద్వారా రిలీజ్ వర్త్ అటూ ఇటూగా 2.6 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 3 కోట్ల వరకు బిజినెస్ రేంజ్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.3 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ లో ఇంకా ఏమైనా మార్పులు ఉంటే మళ్ళీ తర్వాత అప్ డేట్ చేస్తాం.

ఇక సినిమా టోటల్ థియేటర్స్ ని కౌంట్ ని గమనిస్తే… నైజాం లో సినిమా సుమారు 142 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా టోటల్ ఆంధ్రలో సినిమా సుమారు 250 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. దాంతో టోటల్ తెలుగు రాష్ట్రాలలో సినిమా 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సుమారు 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మూడు రోజుల నుండే మొదలు అయినా ఇది వరకు ఇలానే రిలీజ్ చేసి చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం లాంటివి ఆడియన్స్ మనసులో ఉండటంతో సినిమా ఇప్పుడు థియేటర్స్ లో వచ్చాకే ఎక్కువ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది.

సినిమా అనుకున్నట్లు రిలీజ్ అయ్యి టాక్ బయటికి వస్తే సినిమా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సినిమా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర అంతా బాగుంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితిని బట్టి సినిమా 50 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని పిస్తుంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు జనాలను థియేటర్స్ కి రప్పించగలుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here