Home న్యూస్ విజయ్ సేతుపతి ‘ఏస్’ కి చుక్కలు…మైండ్ బ్లాంక్ చేస్తున్న కలెక్షన్స్!!

విజయ్ సేతుపతి ‘ఏస్’ కి చుక్కలు…మైండ్ బ్లాంక్ చేస్తున్న కలెక్షన్స్!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మహారాజ సినిమా తో సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ ఏస్(ACE Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది…సినిమా మీద పెద్దగా ఏమి అంచనాలు ఏమి లేక పోయినా కూడా టాక్ బాగుంటే ఏమైనా…

జోరు చూపెడుతుంది అనుకున్నా కూడా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయిన సినిమా మొదటి రోజే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా దారుణంగా విఫలం అయ్యి తీవ్రంగా నిరాశ పరిచే విధంగా వీకెండ్ లో పెర్ఫార్మ్ చేసింది.

వీకెండ్ లో తమిళనాడులో 4 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. తెలుగు లో అయితే ఇప్పటి వరకు కేవలం 60 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా షేర్ పరంగా 25 లక్షల రేంజ్ లో కూడా షేర్ ని అందుకోలేక పోయింది.

సినిమా ఇక 4 రోజుల్లో టోటల్ గా వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా షేర్ అటూ ఇటూ గా 2.4 కోట్ల రేంజ్ లో ఉండటం కూడా కష్టమే అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించు కోవాలి అంటే 18 కోట్ల రేంజ్ లో షేర్ ని..

అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించ లేక పోయింది… తెలుగు లో కూడా డిసాస్టర్ రిజల్ట్ ను కన్ఫాం చేసుకున్న ఓవరాల్ గా మహారాజ లాంటి బ్లాక్ బస్టర్ విడుదల2 లాంటి ఓకే అనిపించే సినిమా తర్వాత విజయ్ సేతుపతికి భారీ ఎదురుదెబ్బగా నిలిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here