Home న్యూస్ బాక్స్ ఆఫీస్ బరిలో పోటి పడుతున్న ఆచార్య నారప్ప…భారీ షాక్ ఇచ్చారుగా!!

బాక్స్ ఆఫీస్ బరిలో పోటి పడుతున్న ఆచార్య నారప్ప…భారీ షాక్ ఇచ్చారుగా!!

1376
0

బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి అన్నది కామన్ గా జరుగుతూనే ఉంటుంది, కానీ రీసెంట్ గా టాలీవుడ్ లో 2020 లో రావాల్సిన సినిమాలు కరోనా వలన ఆగిపోవడం తో ఒకటి తర్వాత ఒకటి అవి 2021 లో రిలీజ్ కానున్నాయి. రీసెంట్ గా మరీ షాకింగ్ గా ఒకటి కి మించి ఒకటి కొత్త సినిమాలు రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేస్తూ సమ్మర్ నుండి ఇయర్ ఎండ్ వరకు నాన్ స్టాప్ గా ఆడియన్స్ ను అలరించడానికి…

సిద్ధం అవ్వగా టాలీవుడ్ సమ్మర్ మొత్తం పాక్ అయిపొయింది, దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ క్లాష్ లు కూడా కాబోతున్నాయి. ఈ సందర్భంగా సీనియర్ హీరోల మధ్య పోటి కూడా ఇప్పుడు కన్ఫాం అయింది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న కొత్త సినిమా..

నారప్ప రిలీజ్ డేట్ ను ముందు అనౌన్స్ చేశారు. మే నెలలో 14 న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఆశగా ఓపెన్ గ్రౌండ్ లో సినిమా దుమ్ము లేపుతుందని సంబరపడుతూ ఉండగా సడెన్ గా మెగా షాక్ తగిలింది.

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఆచార్య అఫీషియల్ టీసర్ రిలీజ్ అయిన తర్వాత కొద్ది సేపటికి సినిమా రిలీజ్ డేట్ ను కూడా కన్ఫాం చేశారు. సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు మే 13 న రిలీజ్ కాబోతుందని పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫాం చేశారు. దాంతో ఇప్పుడు ఒక్క రోజు తేడాతో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి పడబోతున్నాయి.

నారప్ప రీమేక్ సినిమా అండ్ బడ్జెట్ తక్కువలో తెరకెక్కుతుంది, మరో పక్క ఆచార్య భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అండ్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు, ఇలాంటి టైం లో ఓపెన్ వీక్ చూసుకోవాల్సింది పోయి పోటి లో దిగడంతో ఏ సినిమా కి ఇది ప్లస్ అవుతుంది ఏ సినిమా కి మైనస్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here