Home న్యూస్ ఆచార్య రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

ఆచార్య రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

1

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య ఎట్టకేలకు భారీ రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా 2000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంది… కొరటాల శివ మరో సారి మెస్మరైజ్ చేశారా లేదా తెలుసు కుందాం పదండీ…

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… ధర్మస్థలిలో పాదగట్టం ప్రాంతాన్ని సోనూ సూద్ తన గుప్పెట్లో పెట్టుకుని అకృత్యాలు చేస్తూ ఉంటాడు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆ ప్రాంతానికి ఆచార్య అయిన చిరు ఎంటర్ అవుతాడు… చిరు ఎంటర్ అయిన తర్వాత విలన్స్ బెండు తీయడం స్టార్ట్ చేయగా…

తర్వాత ఏం జరిగింది…. ఆచార్య కి సిద్దా ఎలా పరిచయం, ఆ రోల్ కి ఏం జరిగింది అన్న విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ట్రైలర్ లోనే ఆల్ మోస్ట్ స్టొరీ చెప్పిన కొరటాల శివ అసలు కథ ఇది కాదని సినిమా చూస్తె తెలుస్తుంది అని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు…. కానీ సినిమాలో ఏ కోశానే వేరే కథ అంటూ ఏమి ఉండదు…

అతి సాధారణ కథని అత్యంత పేలవ మైన స్క్రీన్ ప్లే తో ఇద్దరు మాస్ హీరోలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోయాడు కొరటాల శివ… ఇది తన కెరీర్ లోనే వీకేస్ట్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి మాస్ యాటిట్యూడ్ తోనే మెప్పించినా కానీ…

ఆ పాత్రకి ఇంకా స్కోప్ అవసరం కానీ అలాంటి స్కోప్ ఇవ్వలేదు డైరెక్టర్… ఉన్నంతలో చిరు తన రోల్ వరకు ఫుల్ న్యాయం చేశాడు అని చెప్పాలి, ఇంట్రో సింపుల్ గానే ఉన్నా ఫైట్స్ అండ్ డాన్స్ తో కుమ్మేశాడు. ఇక రామ్ చరణ్ రోల్ చిన్నదే అయినా స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్న రామ్ చరణ్ రోల్ కూడా బాగా సెట్ అయింది… ఇక చిరు చరణ్ ల కాంబో సీన్స్ బాగున్నప్పటికీ మరీ ఎక్స్ పెర్ట్ చేసినంత అయితే లేవు…. భలే భంజారా సాంగ్ లో మాత్రం ఇద్దరు హీరోలు కుమ్మెశారు…

ఇక మిగిలిన రోల్స్ ఎవ్వరికీ కూడా అనుకున్నంత ప్రాధాన్యత లేదు, పూజా హెగ్డే పర్వాలేదు అనిపించగా…. సోనూ సూద్ జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన క్యారెక్టర్స్ చాలా మందే ఉన్నా అందరూ ఓకే అనిపించుకున్నారు. ఇక సంగీతం పరంగా మణిశర్మ పర్వాలేదు అనిపించుకున్నాడు. సాంగ్స్ వినడానికి చూడటానికి పర్వాలేదు అనిపించాయి… కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బిలో యావరేజ్ గానే ఉంది… ఫైట్ సీన్స్ కి హీరోయిజం ఎలివేట్ సీన్స్ ఇంకా ఇంపాక్ట్ ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్ అవసరం ఉన్నా అది మిస్ అయింది సినిమాలో…

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉండగా సినిమాలో బోర్ సీన్స్ చాలా ఉన్నాయి… సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా కొన్ని CG షాట్స్ మాత్రం నిరాశ పరిచాయి… ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ముందే చెప్పినట్లు ఇది కొరటాల కెరీర్ లో వీకేస్ట్ మూవీ అనడంలో ఎలాంటి డౌట్ లేదు…చాలా సింపుల్ కథని సాగదీసిన కొరటాల కొన్ని సీన్స్ మినహా ఎక్కడా కూడా తన ప్రీవియస్ మూవీస్ లో లాగా…

ఇంపాక్ట్ ని కానీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సీన్స్ ని కానీ పెట్టలేక పోవడంతో ఆచార్య చాలా వరకు డిస్ కనెక్టెడ్ గానే ఉంది…. కొరటాల నుండి మినిమమ్ గ్యారెంటీ ఎక్స్ పెర్ట్ చేసిన అందరికీ ఇది మైండ్ బ్లాంక్ దెబ్బ అనే చెప్పాలి. మొత్తం మీద సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని యాక్షన్ సీన్స్, భలే భంజారా సాంగ్, ఇద్దరు హీరోల కొన్ని కాంబో సీన్స్ అని చెప్పాలి… ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…

కొరటాల డైరెక్షన్, ప్రిడిక్టబుల్ స్టొరీ, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకపోవడం, బ్యాగ్రౌండ్ స్కోర్, స్లో నరేషన్, మేజర్ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ వెళ్ళే ఆడియన్స్ ఓపికతో సినిమా చూస్తె యావరేజ్ గా అనిపిస్తుంది కానీ అది కూడా చాలా ఓపికతో చూడాల్సి ఉంటుంది…మిగిలిన కామన్ ఆడియన్స్ కి సినిమా బిలో యావరేజ్ లెవల్ లోనే ఉంటుంది అని చెప్పాలి…. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్….

1 COMMENT

  1. Nuvu yeppudu movie bagundhi annav pushpa movie release ayinapudu kuda edge annav kani pushpa movie blockbuster hit ayindhi Eppudu kuda alage cheptunav acharya movie kuda blockbuster hit ayitadhi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here