ఏదైనా పెద్ద సినిమా వస్తుంది అంటే… ఆ సినిమా కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, సినిమా లో ఏదైనా కాంట్రవర్సీ ఉంటె క్యాష్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, మరి కొందరు ఈ కథ మాదే అంటూ అనేక సార్లు గొడవ చేసిన విషయం తెలిసిందే, లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అయిన ఆచార్య పై ఇదే న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.
మెగాస్టార్ ఆచార్య మోషన్ పోస్టర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా అందులో చిరు నక్సలైట్ అని లాంటి ఏ వివరాలు తెలియకున్నా మోషన్ పోస్టర్ కథ కి “ధర్మస్థలి” అనే ప్రాంతానికి ఎదో లింక్ ఉందని అర్ధం అవుతుంది. కానీ ఇక్కడే కథ మొత్తం తెలిసినట్లు…
కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఇది నా కథే అంటూ ఆరోపణలు చేస్తున్నారు… ధర్మస్థలి చుట్టూ అల్లుకున్న కథ నాదే అంటూ… ఇదంతా తానూ… ‘పుణ్యభూమి’ అనే టైటిల్‌తో 2006లో రైటర్స్ అసోసియేషన్‌లో ఒక కథని రిజిస్టర్ చేయించినట్లుగా ఆయన చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉండగా…
మోషన్ పోస్టర్ లోనే కథ తెలిసింది అది నా కథే అంటూ రావడం కొంచం వింతగా ఉంది. ఇది వరకు కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమా కథ పై కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి కానీ తర్వాత సైలెంట్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఇలానే సైలెంట్ అయిపోతాయని అంటున్నారు విశ్లేషకులు. స్టార్ హీరోల సినిమాలకు ఈ మధ్య…
ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. కథలు మావే అంటూ కొందరు గొడవ చేయడం తర్వాత టీవీలకు ఎక్కడం కామన్ అయ్యింది, అందులో నిజానిజాలు మాత్రం పూర్తిగా బయటికి రాకున్నా తెరవెనుకే సెటిల్ మెంట్స్ చేసుకుంటారు అన్న టాక్ కూడా ఉంది. మరి ఇప్పుడు ఎం జరుగుతుంది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది…