మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన రన్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగిస్తుంది, సినిమా 10 రోజుల్లో టోటల్ గా 128 కోట్ల వరకు షేర్ ని అందుకుని ఓవరాల్ గా ఆల్ టైం నాలుగో బిగ్గెస్ట్ షేర్ ని అందుకున్న టాలీవుడ్ సినిమా గా నిలిచింది. కాగా ఈ క్రమం లో సినిమా కొన్ని ఏరియాల్లో రికార్డులు కొట్టింది, సీడెడ్ లో 8 రోజులు…
నాన్ స్టాప్ గా రోజుకి కోటి రేంజ్ షేర్ ని అందుకుని సంచలనం సృష్టించిన సైరా సినిమా ఇప్పుడు నైజాం ఏరియా లో కూడా ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ ను అందుకుంది, నైజాం లో రోజు కి మినిమం కోటి రేంజ్ షేర్ ని అందుకున్న సినిమాల్లో బాహుబలి ని పక్కకు పెడితే…
మిగిలిన సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది 2013 లోనే ఏకంగా 9 రోజుల పాటు నాన్ స్టాప్ గా రోజుకి కోటి చొప్పున షేర్ ని నైజాం లో అందుకుని సంచలనం సృష్టించింది. ఆ రికార్డ్ ను ఈ ఏడాది రిలీజ్ అయిన ఎఫ్ 2 సినిమా సమం చేసింది.
9 రోజుల పాటు నాన్ స్టాప్ కోటి కి పైగా షేర్ ని అందుకుంది 10 వ రోజు 97 లక్షల షేర్ ని అందుకుని 3 లక్షల దూరంలో అత్తారింటికి దారేది రికార్డ్ ను మిస్ చేసుకుంది. ఇక ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి కూడా నాన్ స్టాప్ గా 9 రోజుల పాటు మినిమం కోటి దాకా షేర్ ని అందుకుంటూ రాగా…
10 వ రోజు ఆ రికార్డ్ మిస్ అయింది, ఇక ఈ సినిమాల తర్వాత రంగస్థలం మరియు మహర్షి సినిమా లు 7 రోజుల పాటు కోటి వరకు వసూళ్ళ ని అందుకున్నాయి. సైరా మరియు ఎఫ్ 2 సినిమాలు కొత్త రికార్డ్ ను అందుకునే అవకాశాన్ని జస్ట్ లో మిస్ చేసుకున్నాయి. దాంతో 2013 నుండి ఆ రికార్డ్ అలాగే కొనసాగుతుంది.