Home న్యూస్ చిన్న సినిమా..రిలీజ్ అయినప్పుడు పట్టించుకోలేదు..ఇప్పుడు అద్బుతం అంటూ పొగుడుతున్నారు!

చిన్న సినిమా..రిలీజ్ అయినప్పుడు పట్టించుకోలేదు..ఇప్పుడు అద్బుతం అంటూ పొగుడుతున్నారు!

0

కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎవరూ పట్టించుకోరు కానీ…తర్వాత అవే సినిమాలు టెలివిజన్ లో చూసినప్పుడో లేదో ఒరిజినల్ ప్రింట్ డిజిటల్ లో రిలీజ్ అయినప్పుడు బాగుంటే… అప్పుడు మంచి పేరు ను తెచ్చుకుంటుంది. రీసెంట్ గా ఇలానే ఓ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు ఎవ్వరూ పెద్దగా పట్టించు కోలేదు కానీ తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయ్యాక సినిమా చూసి బాగుంది అంటూ మెచ్చుకుంటున్న వాళ్ళు ఎక్కువ అయ్యారు.

ఆ సినిమా నే రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు భారీ పోటి లో రిలీజ్ అయ్యి అసలు జనాల దృష్టి లో కూడా పడకుండా వీకెండ్ కే పరుగు ను ముగించి వారం పది రోజులకే డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న AD ఇన్ఫినిటుం సినిమా… యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా…

అవడానికి చిన్న సినిమా నే అయినా చాలా వరకు మెప్పించింది, కథ పాయింట్ ఏంటంటే…. బ్రెయిన్ లో ఉండే ఇన్ఫినిటుం ని మనం అదుపులోకి తీసుకుంటే మనిషి చావు లేకుండా బ్రతికి ఉండొచ్చు అన్న పాయింట్ తో సినిమా తెరకెక్కగా ఆ కథ పాయింట్ హీరో చుట్టూ ఎలా తిరిగింది…

ఆ కథ పాయింట్ వలన హీరో ఎదురుకున్న సమస్యలు ఏంటి లాంటివి సినిమాలో బాగానే చూపెట్టారు కానీ లెంత్ మరీ ఎక్కువ చేయడం, స్లో నరేషన్ లు ఇబ్బంది పెట్టాయి, అలా కాకుండా సినిమా ను 2 గంటల లోపు లెంత్ తో మరింత క్రిస్ప్ గా రూపొందించి ఉంటె ఇంకా అద్బుతంగా ఉండి ఉండేది ఈ సినిమా…

అయినా కానీ కొంచం ఓపికతో చూస్తె ఓ డిఫెరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ అండ్ ఓ కొత్త కథని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. రిలీజ్ అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకొని ఈ సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో చూసిన వాళ్లు కాన్సెప్ట్ ని మెచ్చుకుంటూ సోషల్ మీడియా లో సినిమాను చూడని వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు. మీరు ఫ్రీ టైం లో ఓ లుక్ వేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here