పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ (adiPurush) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వీకెండ్ వరకు వీర విహారం చేసినా కూడా తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం సినిమా ఏమాత్రం జోరు చూపించలేక పోయింది…
హిందీలో కూడా సినిమా రికార్డ్ లెవల్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా వర్కింగ్ డేస్ లో మాత్రం అక్కడ కూడా తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా కి అక్కడ ఎలాగైనా జనాలను థియేటర్స్ రప్పించ డానికి మేకర్స్ ఒక ఆఫర్ ని పెట్టారు…
నేషనల్ మల్టీ ప్లెక్సులలో సినిమా కి ఈ నెల 22-23 తేదీలలో ఒక్క టికెట్ 150 వరకు మాత్రమే ఉంటుందని ఆఫర్ ఇచ్చారు… బాలీవుడ్ లో రీసెంట్ టైంలో వర్కింగ్ డేస్ లో జనాలను థియేటర్స్ కి రప్పించడానికి ఇలాంటి ఆఫర్స్ ని పెడుతూ ఉండగా…
చాలా వరకు సినిమాలకు ఇది వర్కౌట్ అయినా కూడా ఆదిపురుష్ సినిమా వరకు ఈ ఆఫర్ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి ఇప్పుడు… 2 రోజుల్లో సినిమా కలెక్షన్స్ లో ఏమైనా గ్రోత్ ఉంటుంది అనుకున్నా కూడా 2 రోజుల్లో సినిమా తిప్పి కొడితే కేవలం ….
4 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది….దాంతో టికెట్ రేటు 150 అంటూ పెట్టిన ఆఫర్ కూడా ఏమి వర్కౌట్ అవ్వలేదు. వీకెండ్ లో ఈ ఆఫర్ పెట్టి ఉంటే కొంచం బెటర్ ఆక్యుపెన్సీ సినిమాకి సొంతం అయ్యి ఉండేదేమో అని అనుకుంటున్నారు ఇప్పుడు.