బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) టీసర్ రిలీజ్ టైంలో విపరీతమైన ట్రోల్స్ ని ఫేస్ చేసినా తర్వాత అదంతా పాజిటివ్ గానే మారి ట్రైలర్ సాంగ్స్ తో మంచి హైప్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయినా…
తర్వాత లెక్కలన్నీ మారిపోయి సినిమాను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు చాలా మంది, సినిమాలో అనేక మిస్టేక్స్ ను వెతుకుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉండగా మేకర్స్ వాటికి సమాదానం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి. సినిమాలో సెకెండ్ ఆఫ్ లో…
రామ రావణ యుద్ధం చూపించిన విధానంపై అందరూ ట్రోల్ చేస్తున్నారు… ఏ పురాణం తీసుకున్నా సంధ్యాసమయం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత అస్త్ర సన్యాసం చేస్తారు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా యుద్ధం ఆపేసి తిరిగి ఉదయాన్నే యుద్ధం మొదలు పెడతారు…
కానీ ఆదిపురుష్ సినిమాలో లంకలో జరిగే యుద్ధం మొత్తాన్ని రాత్రే జరిగినట్లు చూపించారు. అసలు ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే టీం లో ఎవ్వరూ ఆన్సర్ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇక సినిమా 2D వర్షన్ లో సెకెండ్ ఆఫ్ మొత్తం చాలా డార్క్ గా కనిపించడంతో…
అసలు ఏ సీన్స్ ఏంటో, ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో లాంటి డీటైల్స్ చాలా మందికి అర్ధం అవ్వలేదు… ఎదో నార్మల్ సినిమా అనుకుంటే ఇలాంటి ఫ్లాస్ 100 ఉన్నా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ రామాయణంని బేస్ చేసుకుని తీసిన సినిమాలో ఇలా అనేక మిస్టేక్స్ చేసిన టీం ఇప్పుడు భారీ ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది.