పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ (AdiPurush) భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను అందుకోవడంలో సఫలం అవ్వక పోయినా కూడా ఉన్నంతలో వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది.
కానీ టాక్ అండ్ ట్రోల్స్ వలన పరుగును త్వరగానే ముగించినా మాస్ సెంటర్స్ లో ప్రభాస్ స్టార్ డం దృశ్యా ఉన్నంతలో సీడెడ్ లో సినిమా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సాధించింది కానీ బ్రేక్ ఈవెన్ కి మాత్రం చాలా దూరంలోనే సినిమా ఆగిపోవాల్సి వచ్చింది.
సినిమాను రాయలసీమ ఏరియాలో మొత్తం మీద 17.60 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా మొదటి వీకెండ్ లోనే కుమ్మేసింది కానీ తర్వాత కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అవుతూ రాగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి ఇక్కడ సినిమా….
బళ్ళారి ఇతర చోట్ల కలెక్షన్స్ తో అప్ డేట్ అయ్యి 10.78 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసుకుంది. మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ అయిన 17.60 కోట్ల లో 10.78 కోట్లు రికవరీ చేసి ఇక్కడ మొత్తం మీద…
6.82 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసుకుంది ఈ సినిమా… సినిమా టాక్ పాజిటివ్ గా వచ్చి ఉంటే ఇక్కడ కూడా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సాధించేది కానీ ఓవరాల్ గా నష్టాలతోనే పరుగును పూర్తీ చేసుకున్న ఈ సినిమా లాస్ లను ప్రభాస్ ఇప్పుడు సలార్(Salaar) పూడ్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.