బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఆదిపురుష్(Adipurush) మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను అయితే అందుకోలేక పోయింది. అయినా కానీ ప్రభాస్(Prabhas) స్టార్ డం, రామాయణం అనడంతో హైప్ ను సొంతం చేసుకున్న సినిమా మంచి ఓపెనింగ్స్ నే అందుకుంది…
కానీ సినిమాలో అనేక బ్లండర్ లు ఉండగా రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన ట్రోల్స్ ను ఫేస్ చేస్తుంది ఈ సినిమా… అందులో తెలుగు ఆడియన్స్ ను సైతం కోపం తెప్పించిన అంశం సినిమా డబ్బింగ్ క్వాలిటీ…. సినిమాలో లీడ్ యాక్టర్స్ తెలుగు డబ్బింగ్ కూడా దారుణంగా ఉంటుంది…
పాన్ ఇండియా మూవీ అంటే అన్ని భాషల్లో ఇది వరకు షూట్ చేసే వాళ్ళు, కానీ ఇప్పుడు ఒక్క భాషలో షూట్ చేసి ఇతర భాషల్లో డబ్ చేసి పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. ఆదిపురుష్ లో ఉన్నది మన హీరో కాబట్టి తెలుగు మరియు హిందీ లో సెపరేట్ గా సినిమాను రూపొందించారు అని కొందరు అనుకున్నారు…
కానీ ఇది ప్రాపర్ హిందీ మూవీ… ఒకటి రెండు సీన్స్ లో తప్పితే ప్రభాస్ కూడా హిందీలోనే ఆన్ లొకేషన్ లో డైలాగ్స్ చెప్పగా తెలుగు వర్షన్ కి తన డబ్బింగ్ తో డైలాగ్స్ చెప్పారు. ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా హిందీలోనే డైలాగ్స్ ని చెప్పగా సినిమా స్టార్టింగ్ లో… క్రితిసనన్-సన్నీ సింగ్ ల డైలాగ్స్…
లిప్ సింక్ అసలు ఏమాత్రం మ్యాచ్ కాలేదు, కొన్ని సీన్స్ లో ప్రభాస్ లిప్ సింక్ కూడా మ్యాచ్ అవ్వలేదు. పాన్ ఇండియా మూవీ అంటూ చెప్పినా రీసెంట్ టైం లో ఏ సినిమా విషయంలో కూడా ఇలా డైలాగ్ ముందు వచ్చి ముఖ కదలికలు తర్వాత జరగడం ఒక్క ఆదిపురుష్ విషయంలోనే జరిగింది…
అంత పెద్ద స్టార్ ను పెట్టుకుని, తెలుగు లో ఈ రేంజ్ మార్కెట్ ఉన్న హీరో తో సినిమా తీసి ఇలాంటి క్వాలిటీ పరమైన జాగ్రత్తలు కూడా తీసుకోలేక పోయారు టీం…ఈ సినిమా విషయంలో అనేక మిస్టేక్స్ చేసిన టీం కనీసం డబ్బింగ్ విషయంలో కూడా సరైన ఎడిటింగ్ చేయలేక పోయారు.
Cenema chala nachindi brother naku. miru kodi guddu mida eekalu enduku peekuthunnaro naku artham kavatam ledu.
Meesala ramunee I can never see
N same to hanumanthudu with gaddamu