Adi Purush Non Theatrical Business: పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ ఆది పురుష్ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అందరిలోనూ ఇప్పుడు అంచనాలు అయితే మరో లెవల్ కి వెళ్ళిపోయాయి.
మైతలాజికల్ మూవీకి ఈ రేంజ్ లో ఆడియన్స్ నుండి రెస్పాన్స్ రీసెంట్ టైంలో ఏ సినిమా కి కూడా చూడలేదు. ప్రభాస్ పేరు మీద ఉన్న నమ్మకంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా కి బిజినెస్ కూడా అన్ని చోట్లా ఇదే రేంజ్ లో జరగడం విశేషం.
కాగా సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 240 కోట్ల దాకా ఉండగా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ ఎంతవరకు అమ్ముడుపోయాయి అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ చేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…
అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి ఏకంగా 245 కోట్ల రేంజ్ లో రేటు పలికినట్లు సమాచారం… అంటే మొత్తం మీద సినిమా ద్వారా మేకర్స్ కి చాలా మొత్తమే వెనక్కి వచ్చింది కానీ హిందీ అలాగే ఓవర్సీస్ లో ఓన్ రిలీజ్ చేయడంతో…
ఈ ఏరియాల నుండి మేకర్స్ కి భారీ వసూళ్లు వస్తే సినిమా కి లాభాలు వస్తాయి, అలాగే తెలుగు రాష్ట్రాల కూడా సినిమా కి నాన్ రిఫండబుల్ అమౌంట్స్ ఉండటంతో సినిమా ఇక్కడ కూడా 155 కోట్లకు పైగా వసూళ్ళని రాబడితే 30 కోట్లకు పైగా లాభం వస్తుంది… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.