పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి 3 వారాలను పూర్తీ చేసుకోగా సినిమా ఆల్ మోస్ట్ థియేటర్స్ లో పరుగును ఇప్పుడు పూర్తీ చేసుకుందని చెప్పాలి ఇప్పుడు…కానీ సినిమా మొదటి 3 రోజుల్లో సాధించిన…
రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తర్వాత కంప్లీట్ గా సినిమా స్లో డౌన్ అయిపొయింది. రామాయణంని పూర్తిగా మార్చేసి ఇష్టం వచ్చినట్లు తీశారు అంటూ ప్రతీ ఒక్కరు సినిమా ను ట్రోల్ చేశారు… కానీ మేకర్స్ ఎలాంటి తప్పు చేయలేదు అంటూ…తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకున్నారు. రిలీజ్ కి ముందు రామాయణాన్ని..
ఎలాంటి మార్పులు లేకుండా తీశామని చెప్పిన సినిమా స్టొరీ రైట్స్ మనోజ్ ముంతశీర్, సినిమా రిలీజ్ అయిన తర్వాత మేం అసలు రామాయణాన్ని తీయలేదు అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు….దాంతో విమర్శలు మరింతగా పెరిగిపోగా రైటర్ పై అనేక కేసులు కూడా వేశారు. అయినా ఇప్పటి వరకు తప్పు ఒప్పుకోని రైటర్ డైరెక్టర్ ఇప్పుడు సినిమా…
రిలీజ్ అయిన 3 వారాల తర్వాత మనోజ్ ముంతశీర్ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. మేం తప్పు చేశామని…. ఆడియన్స్ మనోభావాలను దెబ్బతీసేలా చేసి ఉండొచ్చు… తమది ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అంటూ ఇప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వడంతో… ఇప్పుడు కూడా సినిమాను ట్రోల్ చేస్తున్నారు. ఇదే కామెంట్ రిలీజ్ టైంలో చేసి ఉంటే జనాలు మరీ ఇంతలా ట్రోల్ చేసేవాళ్ళు కాదని,
సినిమాకి ఇంకొంచం కలెక్షన్స్ వచ్చేవని కానీ ఇప్పుడు OTT లో సినిమా రిలీజ్ కి సిద్ధం అవ్వడంతో ఇప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా పరుగు ఎలాగూ అయిపోవడంతో ఇక ఎన్ని కామెంట్స్ చేసినా స్టేట్ మెంట్స్ ఇచ్చినా ఇక ఉపయోగం లేనట్టే అని చెప్పొచ్చు.