బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి ఏ రేంజ్ లో ట్రోల్స్ ని ఫేస్ చేసుకుందో అందరికీ తెలిసిందే. సినిమా కి హిందీలో అయితే ఊహకందని రేంజ్ లో ట్రోల్స్ రాగా…
అన్ని చోట్లా సినిమా పై ఓ రేంజ్ లో విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ యూట్యూబ్ లో సినిమా హిందీ వర్షన్ మీద ట్రోల్స్ వీడియోలు భారీగా వస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రభాస్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఫ్యూచర్ లో జరిగే ఒక పెద్ద అవమానం నుండి…
తప్పించుకున్నారని చెప్పాలి ఇప్పుడు… సినిమా మేకింగ్ టైంలో డైరెక్టర్ ఓం రౌత్ సినిమా మీద ఏర్పడ్డ క్రేజ్ తో 2 పార్టులుగా ఈ సినిమాను తీయాలని భావించాడు… ఈ విషయాన్నీ ప్రభాస్ తో కూడా మాట్లాడినట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టగా…
ప్రభాస్ మాత్రం ఇది సంపూర్ణ రామాయాణం కాదు కాబట్టి ఒక ఘట్టం మీద తీస్తున్న సినిమా అవ్వడంతో రెండో పార్ట్ వర్కౌట్ కాకపోవచ్చు అంటూ ఒక్క పార్ట్ అయితేనే బాగుంటుంది అని చెప్పి ఒక్క పార్ట్ కే సినిమాను కంప్లీట్ చేయాలనీ చెప్పాడట. అందుకే రెండు పార్టులు అనుకున్న…
ఆదిపురుష్ ఒక్క పార్ట్ కే అయిపోయి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చి ఈ రేంజ్ లో ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అదే 2 పార్టులు అంటే ఇప్పుడు వచ్చిన ట్రోల్స్ తో రెండో పార్ట్ తో మరింత అవమానాలు టీం కి ఎదురు అయ్యేవి అంటూ ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు…