పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adi Purush) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా రిలీజ్ అయిన తర్వాత భారీ లెవల్ లో ట్రోల్స్ ని ఫేస్ చేసినా కూడా వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా మాత్రం అద్బుతంగా జోరును…
చూపించి కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేసింది అని చెప్పాలి. కానీ విపరీతమైన ట్రోల్స్ సోషల్ మీడియాలో సినిమా పై రావడంతో ఆ ఇంపాక్ట్ వర్కింగ్ డేస్ లో క్లియర్ గా కనిపించింది. సినిమా హిందీ లో 3వ రోజు 38.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
ఏ పెద్ద సినిమా అయినా కూడా అటూ ఇటూగా 55% టు 60% రేంజ్ లో వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటాయి. కానీ ఆదిపురుష్ సినిమా మీద నార్త్ లో ఎలాంటి అంచనాలు రిలీజ్ కి ముందు ఏర్పడ్డాయో రిలీజ్ తర్వాత వాటికి డబుల్ అనిపించే రేంజ్ లో…
ట్రోల్స్ లాగా కూడా మారడంతో సినిమా 4వ రోజు కుప్పకూలిపోయింది. ఏకంగా 80% వరకు డ్రాప్ అయ్యి 8 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ ని హిందీలో సొంతం చేసుకుంది ఇప్పుడు…ఈ రేంజ్ లో డ్రాప్స్ అంటే సినిమా ఇక తేరుకోవడం కష్టమే అని చెప్పాలి హిందీలో కూడా…
ముందు నుండి కూడా హిందీ మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అందరూ, కానీ మేకర్స్ రామాయణం మీద తీసిన ఆదిపురుష్ ఇలాంటి తీవ్ర విమర్శలు రావడంతో వీకెండ్ తర్వాత కుప్పకూలిపోక తప్పలేదు. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.