పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే సంక్రాంతికి ఆల్ ఇండియా లెవల్ లో భారీ లెవల్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఓవరాల్ గా బడ్జెట్ దృశ్యా చాలా నాసిరకంగా ఉండటం, టీసర్ కి విపరీతమైన ట్రోల్స్ జరగడంతో సినిమాను పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు జూన్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉండగా….
మధ్యలో సినిమా గ్రాఫిక్స్ రీ వర్క్ గురించిన ఎలాంటి వార్తలు బయటికి రాలేదు కానీ, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం టీం సినిమా రీ వర్క్ గ్రాఫిక్స్ వర్క్ తో ఏమాత్రం సంతోషంగా లేరని అంటున్నారు…. గ్రాఫిక్స్ కంప్లీట్ గా చేంజ్ చేయకుండా పైన పైన…
కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో అవి పెద్దగా ఇంప్రెస్ చేసేలా లేవని వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉండగా ఓవరాల్ గా గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన సినిమాకి ఆ గ్రాఫిక్స్ పైనే ట్రోల్స్ వస్తూ ఉండటం….
ఇప్పుడు టీం బడ్జెట్ ని ఇంకా పెంచి గ్రాఫిక్స్ ని మెరుగు పరిచే ప్రయత్నం చేస్తున్నా అనుకున్న విధంగా రావడం లేదు అన్న వార్తలు సినిమా ఔట్ పుట్ ఎలా ఉంటుంది అనిపించేలా చేస్తుంది. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా ఏకంగా 550 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.