టాలీవుడ్ హీరోలలో చాలా మందికి చాలా టైంగా అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ లేదు, కానీ మంచి ఆఫర్స్ ఎప్పటి కప్పుడు ఉన్న చిన్న హీరోలలో సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ కూడా ఒకరు అని చెప్పాలి. కెరీర్ మొదట్లో ప్రేమ కావాలి, లవ్ లీ లాంటి సూపర్ హిట్స్ తర్వాత అనేక ఆఫర్స్ సొంతం చేసుకున్నా కూడా…
బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోలేక పోయిన ఆది, రీసెంట్ టైంలో చాలా సినిమాలనే చేస్తూ వస్తున్నా అనుకున్న రేంజ్ లో రిజల్ట్ సొంతం అవ్వలేదు, లాస్ట్ ఇయర్ ఆది నటించిన ప్రేమ కావాలి రీ రిలీజ్ లో మంచి రిజల్ట్ ను సొంతం చేసుకోగా…
తిరిగి కొంచం పేరు రాగా తన లేటెస్ట్ మూవీస్ కి డీసెంట్ లెవల్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ లు కూడా జరుగుతూ ఉండగా ఇప్పుడు తన కమింగ్ మూవీస్ లో ఒకటైన కొత్త సినిమా ఎస్ ఐ యుగందర్ అనే మూవీ కి నాన్ థియేట్రికల్ బిజినెస్ తన కెరీర్ లోనే…
హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. ఈ సినిమా కి టోటల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ రేంజ్ ఏకంగా 7 కోట్ల దాకా రేటు పలికిందట…అందులో ఈటీవీ విన్ యాప్ వాళ్ళు సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ను ఆల్ మోస్ట్ 4 కోట్ల రేటు చెల్లించి…
సొంతం చేసుకున్నారట. అలాగే హిందీ డబ్బింగ్ శాటిలైట్ అండ్ ఇతర రైట్స్ మరో 3 కోట్ల రేటు పలికిందట. దాంతో ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రేంజ్ లో రేటుని హిట్స్ చాలా కాలంగా లేక పోయినా కూడా సొంతం చేసుకున్న ఆది కి…
ఈ బిజినెస్ కెరీర్ లో మళ్ళీ స్పీడ్ పెంచడానికి మంచి కాన్ఫిడెంట్స్ ఇస్తుందని చెప్పాలి. ఇక తన అప్ కమింగ్ సినిమాలు కొన్ని షూటింగ్ ఎండ్ స్టేజ్ లో ఉండగా ఈ ఏడాది ఒకటి తర్వత ఒకటి రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా వాటిలో ఏ సినిమాతో ఓ మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.