Home న్యూస్ ఆదిత్య ఓం ప్రయోగాత్మక ఫిలిం “పవిత్ర “!!

ఆదిత్య ఓం ప్రయోగాత్మక ఫిలిం “పవిత్ర “!!

0

యాక్టర్‌గా వెండితెరపై తన టాలెంట్ చూపించి ప్రేక్షకుల మెప్పుపొందిన యువ హీరో ఆదిత్య ఓం డైరెక్టర్ గా కూడా సత్తా చాటారు. సూపర్ సక్సెస్ సినిమాల్లో భగమయ్యారు కెరీర్ పరంగా పూల బాటలు వేసుకున్నారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు పవిత్ర అనే ఓ ప్రయోగాత్మక షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

వెండితెరపై సత్తా చాటి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న ఆదిత్య ఓం.. మొట్టమొదటి సారి పవిత్ర అనే షార్ట్ ఫిలిం చేస్తుండటం విశేషం. థ్రిల్లింగ్ జానర్‌లో ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జ్యోతి, గాయత్రి గుప్త, ఐశ్వర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మోడర్న్ సినిమా బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు వీరల్, లవన్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. మధుసూదన్ కోట సినిమాటోగ్రాఫర్ గా, ప్రకాష్ ఝా ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిలింని యూట్యూబ్‌తో పాటు ఓటీటీలో విడుదల చేయబోతున్నారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మూవీపై ఆసక్తి పెంచేశారు. ఆదిత్య ఓం చేతిలో మొబైల్ ఫోన్స్, ఆ వెనకాల జ్యోతి, గాయత్రీ గుప్త లుక్స్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేలా ఉన్నాయి.తన భార్య మిస్ కావడంతో ఓ బ్లైండ్ డాక్టర్ వెతకడం అనే పాయింట్ తీసుకొని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా రూపొందిస్తున్నారట. టైటిల్ రోల్ జ్యోతి పోషిస్తుండగా.. గాయత్రి గుప్త మరో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. గాయత్రీ రోల్ సినిమాలో కీలకం కానుందట. జాకిర్ హుస్సేన్, ఐశ్వర్య, వెంకట్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

పెరుగుతున్న టెక్నాలజీలో షార్ట్ ఫిలిమ్స్ కీలక భూమిక పోషిస్తున్నాయని, ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్
కెమెరా ముందు సరికొత్త ప్రయోగాలు చేసేందుకు అనువుగా ఉండటమే గాక ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంటాయని ఆదిత్య ఓం అన్నారు. అలాంటి కోవలోనే ఈ పవిత్ర మూవీ ఉంటుందని చెప్పారు.

నటీనటులు: ఆదిత్య ఓం, జ్యోతి లాభాల, గాయత్రి గుప్త, జాకిర్ హుస్సేన్, ఐశ్వర్య, వెంకట్ తదితరులు

సాంకేతిక వర్గం:
డైరెక్టర్- ఆదిత్య ఓం
మ్యూజిక్- వీరల్, లవన్
DOP- మధుసూదన్ కోట
ఎడిటర్- ప్రకాష్ ఝా
బ్యానర్- మోడర్న్ సినిమా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here