నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు….బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ విజయాలను పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్ కమింగ్ మూవీస్ కూడా చాలా ప్రామిసింగ్ గానే ఉన్నాయి..ముందు డాకూ మహారాజ్ సినిమా …. ఆ తర్వాత బోయపాటితో…
అఖండ2 సినిమాలు చేస్తున్న బాలయ్య ఈ సినిమాలతో అంచనాలను అందుకుంటే కెరీర్ ఆల్ టైం పీక్ లెవల్ లో క్రేజ్ ను ఎంజాయ్ చేస్తూ రికార్డులను కూడా క్రియేట్ చేసే అవకాశం ఉండగా ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే మోస్ట్ వాంటెడ్ మూవీ కన్ఫాం అయింది…
ఇండియన్ మూవీస్ లో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో రూపొందిన మొదటి సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఆదిత్య 369 సినిమా అప్పట్లో ఆడియన్స్ టేస్ట్ కి చాలా ముందుగా ఆలోచించి చేసిన సినిమాగా అయినా మంచి విజయాన్ని అందుకోగా తర్వాత టైంలో సినిమాకి కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కింది…
ఇప్పుడు అలాంటి సినిమాకి సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు బాలయ్య…ఆల్ రెడీ ఈ సినిమా గురించి పలుమార్లు మాట్లాడినా కూడా ఎప్పుడు ఉంటుందో అన్నది మాత్రం చెప్పలేదు…లేటెస్ట్ గా సినిమా గురించి అన్ స్టాపబుల్ సీజన్ లో బాలయ్య మాట్లాడుతూ…
ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య 999 మాక్స్ మూవీ త్వరలో మొదలు కాబోతుందని…సినిమాలో తన తనయుడు నందమూరి మోక్షజ్ఞ మెయిన్ లీడ్ లో సినిమా ఉంటుందని కన్ఫాం చేశాడు బాలయ్య…సినిమాలో బాలయ్య కూడా స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం.
అప్పటి టైంతో పోల్చితే చాలా అడ్వాన్స్ కథతో వచ్చిన ఈ సైన్స్ ఫీక్షన్ మూవీకి ఇప్పుడున్న టెక్నాలజీ అండ్ ఆడియన్స్ టేస్ట్ కి సరైన కథ కుదిరి ఆడియన్స్ నుండి మంచి టాక్ వస్తే ఇక బాక్స్ అఫీస్ దగ్గర కలెక్షన్స్ జాతర ఖాయమని చెప్పొచ్చు…వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం…