బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటికప్పుడు ఎక్స్ పెరిమెంట్స్ సినిమాలతో ఆడియన్స్ లో మంచి పేరుని సొంతం చేసుకున్న యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh) నుండి కొత్త సినిమా వచ్చి చాలా టైమే అవుతుంది. హిట్2 సినిమా తర్వాత కొంత గ్యాప్ ను ఎక్కువగానే తీసుకున్న అడివి శేష్ వరుస సినిమాలతో బిజీ గానే ఉన్నాడు కానీ…
ఆడియన్స్ ముందుకు రావడానికి సరైన టైం కోసం ఎదురు చూస్తున్నాడు. తన అప్ కమింగ్ మూవీస్ లో గూడచారి2 ముందు వస్తుంది అనుకున్నా కూడా ఇప్పుడు ఆ సినిమా కన్నా ముందు తను చేస్తున్న మరో సినిమా డెకాయిట్(Dacoit Movie) ఈ ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు…
రాబోతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ డీసెంట్ లెవల్ లో బజ్ నెలకొనగా సినిమా బిజినెస్ కూడా మంచి జోరుని చూపెడుతూ ఇప్పుడు ఆడియో రైట్స్ పరంగా తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ రేటుని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి.
సోనీ మ్యూజిక్ వాళ్ళు సినిమా ఆడియో రైట్స్ కోసం ఏకంగా 8 కోట్ల భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అడివి శేష్ కెరీర్ లోనే ఇది ఆల్ టైం హైయెస్ట్ రేటు అని చెప్పాలి. చాలా వరకు అడివి శేష్ సినిమాల్లో సాంగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా…
మరీ కమర్షియల్ గా సాలిడ్ హిట్ సాంగ్స్ ఏమి పడలేదు…కానీ ఈ సినిమాలో మ్యూజిక్ మెయిన్ హైలెట్ కాబోతుంది అన్న టాక్ ఉండగా బిజినెస్ పరంగా ఆల్ రెడీ ఎక్స్ లెంట్ రేటుని సొంతం చేసుకున్న డెకాయిట్ మూవీ ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.