బాక్స్ ఆఫీస్ దగ్గర కరోనా వేవ్ తర్వాత మిగిలిన ఇండస్ట్రీలు బాగానే కోలుకున్నా కానీ బాలీవుడ్ మాత్రం ఏమాత్రం కోలుకోలేదు. అడపా దడపా హిట్స్ పడినా కానీ అంచనాలను మించిన పెద్ద సినిమాలు పెద్దగా లేవు. ఉన్నంతలో లాస్ట్ ఇయర్ వచ్చిన సూర్యవంశీ సినిమా మాత్రం సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది… కాగా ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ లో మంచి అంచనాలను సొంతం చేసుకున్న సినిమా బ్రహ్మాస్త్ర అని చెప్పాలి.
ఒక పక్క సినిమా పై బాయికాట్ ట్రెండ్స్ నడుస్తున్నా కానీ సినిమా పై ఆడియన్స్ లో ఎక్స్ లెంట్ క్రేజ్ ఉందని చెప్పాలి. సినిమా కి మొత్తం మీద రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ని గమనిస్తే… హిందీ లో 15 కోట్లకు పైగా బుకింగ్స్ గ్రాస్ ను…
సొంతం చేసుకున్న బ్రహ్మాస్త్ర సినిమా ఇతర సౌత్ భాషలు కలుపుకుని 17 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో రిలీజ్ రోజున సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపడం ఖాయమని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు చూస్తూ ఉంటె…
ఇప్పుడు ఫస్ట్ డే ఇండియాలో పాండమిక్ తర్వాత బాలీవుడ్ నుండి రిలీజ్ అయిన మూవీస్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఇక ఖాయమని చెప్పాలి… సూర్యవంశీ సినిమా డే 1 26.3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు ఆ మార్క్ ని అవలీలగా అందుకునే అవకాశం కనిపిస్తుంది. టాక్ బాగుండి సినిమా షో షోకి…
కలెక్షన్స్ లో సాలిడ్ ట్రెండ్ కనిపిస్తే 32-34 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా కొనసాగడం, బాయికాట్ ట్రెండ్స్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా బాలీవుడ్ లో పాండమిక్ తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డును అందుకోవడం ఇక ఖాయమని చెప్పాలి.