మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ రోజున అనుకోని పరిస్థితుల వలన రిలీజ్ కాలేక పోయింది, తర్వాత థియేటర్స్ సమస్యని కూడా ఎదురుకున్న సినిమా నాసిరకం థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా…..
36.7 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతున్న టైం లో 4 వ వారంలో కొత్త సినిమాల కోసం థియేటర్స్ చాలా తగ్గగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ గట్టిగా కనిపించి కలెక్షన్స్ తగ్గుముఖం పట్టగా సినిమాను 18 రోజులకే డిజిటల్ రిలీజ్ చేయాలనీ…
భారీ రేటు చెల్లించిన ఆహా యాప్ ఏకంగా 10 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ ని చేయగా తర్వాత ఒక వారం వెనక్కి తగ్గగా రేటు 8 కోట్ల రేంజ్ లో తగ్గింది. ఇక సినిమా రీసెంట్ గా డిజిటల్ ప్రీమియర్ ని సొంతం చేసుకోగా మొదటి 24 గంటల్లో ఆహా యాప్ లో సాలిస్ వ్యూస్ ని సినిమా సొంతం చేసుకుందట.
ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం మొదటి రోజుకి గాను సినిమాకి ఆహా యాప్ లో ఆల్ మోస్ట్ 3 లక్షల 20 వేల రేంజ్ లో వ్యూస్ దక్కినట్లు చెబుతున్నారు. ఇది నిజంగానే అద్బుతం అని చెప్పాలి. అందునా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 25 రోజుల తర్వాత డిజిటల్ రిలీజ్ లో ఈ రేంజ్ లో వ్యూస్ ని ఇతర లీడింగ్ OTT యాప్స్ తో పోల్చితే తక్కువ యూసర్స్ ఉన్న ఆహా యాప్ లో…
ఈ రేంజ్ లో వ్యూస్ ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి. దాంతో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ లో కూడా సాలిడ్ గా సక్సెస్ కాబోతుంది అని చెప్పాలి. ఇక త్వరలోనే సినిమా స్టార్ మా ఛానెల్ లో సైతం టెలికాస్ట్ కి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరి అక్కడ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.