సరైన టైం లో సరైన నిర్ణయం తీసుకున్న వాళ్ళే ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారు, కానీ అప్పుడప్పుడు సడెన్ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు కానీ ఇప్పుడు రెండింటిలో ఎలాంటి రిజల్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీ రంగస్థలం సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా రిలీజ్ టైం లోనే కచ్చితంగా తెలుగు వరకే కాదు సౌత్ లో…
అన్ని చోట్ల సరిగ్గా రిలీజ్ ను ప్లాన్ చేసి ఆడియన్స్ ముందుకు ఈ సినిమాను తీసుకు వెళితే సంచలనాలను సృష్టిస్తుంది అని రిలీజ్ టైం లోనే అందరూ చెప్పినా పెద్దగా పట్టించుకొని నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు… సినిమా ఆల్ మోస్ట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత…
తీరుబాటు గా మళయాళం లో డబ్ చేశారు అక్కడ సినిమా రిలీజ్ దెబ్బ కొట్టింది, తర్వాత మరింత లేట్ గా కన్నడ లో డబ్ చేశారు. అక్కడ కూడా దెబ్బ కొట్టింది. ఇక తమిళ్ లో డబ్ అనుకున్నా రీమేక్ రైట్స్ ని అమ్మడంతో ఆ ఆలోచన మానుకున్నా సడెన్ గా ఎందుకనో ఇప్పుడు…
సినిమాను అక్కడ డబ్ చేయాలని డిసైడ్ అవ్వగా రీసెంట్ గా సినిమా తమిళ్ డబ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి ఇప్పుడు సినిమా ఈ నెల 30 న అక్కడ రిలీజ్ కానుంది అంటూ తెలియజేశారు. సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్న టైం లో ఆల్ రెడీ టెలివిజన్ లో చూసిన సినిమాను అక్కడ ఎంతమంది 50% ఆక్యుపెన్సీ లిమిటేషన్స్ లో…
చూడటానికి వస్తారో తెలియదు కానీ అయినా కానీ అదే రోజున రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయిన మేకర్స్ ఆల్ మోస్ట్ 160 థియేటర్స్ లో సినిమాను అక్కడ రిలీజ్ చేయబోతున్నారని ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి సినిమా ఇలాంటి పరిస్థితులలో అక్కడ ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది అని చెప్పాలి.