బాక్స్ ఆఫీస్ దగ్గర కిచ్చ సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోణ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. కాగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో అందుకోవాల్సిన టార్గెట్ ను మూడు రోజుల్లో అందుకుని ఇప్పుడు మంచి లాభాలను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. కాగా టాలీవుడ్ లో ఆల్ మోస్ట్…
లాస్ట్ 2 నెలల్లో హిట్ అయిన మూవీ ఇదొక్కటే అని చెప్పాలి. జూన్ 3 న బాక్స్ ఆఫీస్ దగ్గర మేజర్ మరియు విక్రమ్ మూవీస్ రిలీజ్ అయ్యి హిట్స్ గా నిలవగా తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా హిట్ గీతని దాటలేక పోయింది…
ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవ్వడం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవడం, వీకెండ్ తర్వాత చేతులు ఎత్తేయడం ఇదే జరుగుతూ వచ్చింది. ఆల్ మోస్ట్ 55 రోజుల తర్వాత విక్రాంత్ రోణ రిలీజ్ అయ్యి తెలుగు లో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచి థియేటర్స్ లో రెవెన్యూ జనరేట్ చేస్తుంది.
మొత్తం మీద మీడియం రేంజ్ మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తిగా నిరాశ పరిచిన వేల ఓ డబ్బింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హిట్ గా నిలవడం విశేషం… ఇక ఆగస్టు లో అయినా టాలీవుడ్ ఎదురు చూస్తున్న హిట్ మూవీస్ వస్తాయో లేదో చూడాలి.