Home న్యూస్ చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరో…..ఇప్పుడు ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరో…..ఇప్పుడు ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

0

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన నటులు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు, అలాంటి వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం కొందరే అని చెప్పాలి. ఇప్పుడు ఆ కోవలోకే వచ్చే హీరోల్లో తేజ సజ్జ(Teja Sajja) కూడా ఒకరు. చిన్నప్పటి నుండి సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చిన తేజ సజ్జ ఆల్ మోస్ట్ అందరు స్టార్స్ తో కలిసి నటించాడు అని చెప్పాలి. ఇంద్ర లో చేసిన రోల్ కి…

ఇప్పటికీ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అదిరిపోతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి క్యారెక్టర్ రోల్ గా సమంత ఓ బేబీ సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన తేజ సజ్జ ఈ ఇయర్ జాంబి రెడ్డి సినిమా తో కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక తర్వాత

ఆడియన్స్ ముందుకు జాంబి రెడ్డి సినిమా తో వచ్చిన తేజ సజ్జ సాలిడ్ హిట్ ని అందుకున్న తర్వాత. జాంబి రెడ్డి డైరెక్టర్ తో చేసిన హనుమాన్ సినిమాతో అల్లకల్లోలం సృష్టించాడు. ఊహకందని రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా 296 కోట్లకు పైగా గ్రాస్ తో చరిత్ర సృష్టించింది…

HanuMan Movie Telugu Version Total WW Collections!!

ఈ సినిమా తర్వాత కూడా వరుసగా సినిమాలను కమిట్ అవుతున్న తేజ సజ్జ ఇప్పుడు ముందుగా 2025 లో మిరాయి తో సందడి చేయబోతూ ఉండగా…. ఒక్కో సినిమా కి కోటికి తగ్గని రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడని సమాచారం. జాంబి రెడ్డి- ఇష్క్ సినిమా కి 60 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకున్న తేజ సజ్జ హనుమాన్ కి 1 కోటి రెమ్యునరేషన్ ని తీసుకాగా  ఇప్పుడు…

తన రెమ్యునరేషన్ అమాంతం పెరిగింది అని సమాచారం…మిరాయ్ కోసం ఆల్ మోస్ట్ 6-8 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ ఉండగా ఈ సినిమా అనుకున్నట్లు వర్కౌట్ అయితే త్వరలోనే డబుల్ డిజిట్ రెమ్యునరేషన్ ను తీసుకునే అవకాశం ఎంతైనా ఉందని టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here