బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ అవుతూ అసలు సినిమా మీదే బజ్ తగ్గిపోయింది. ఇలాంటి టైంలో ఎట్టకేలకు సినిమాను ఈ నెల 12న రిలీజ్ చేయబోతున్నట్లు…
అఫీషియల్ గా అనౌన్స్ చేసి ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టగా మరో 8 రోజుల్లో సినిమా రిలీజ్ ఉండగా ఇప్పటి వరకు ట్రైలర్ ను రిలీజ్ చేయలేదు, కానీ ఇప్పుడు సడెన్ గా సినిమా మీద టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న న్యూస్ సినిమాకి చివరి నిమిషంలో ఏర్పడిన…
అవరోధాల వలన ఇప్పుడు రిలీజ్ మరోసారి పోస్ట్ పోన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంట….అఫీషియల్ గా ఇంకా కన్ఫాం ఏమి చేయలేదు కానీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని నిలిపివేశారు. మేజర్ థియేటర్స్ చైన్ నుండి సినిమాను రీసెంట్ గా తొలిగించారు…
ఇక ఇక్కడ చాలా టైంగా షూటింగ్ జరుగుతూ రావడంతో ఫైనాన్స్ డబ్బు లెక్కకు మించి జరగడంతో నిర్మాత సినిమా రేట్స్ ని మరీ ఎక్కువగా చెప్పడంతో ఆ రేట్స్ చెల్లించడానికి బయర్స్ అంత సముకంగా లేక పోవడం ఎఫెక్ట్ అవ్వగా మరో పక్క సినిమా గ్రాఫిక్స్ కంపెనీలకు…
ఫైనల్ అమౌంట్ సెండ్ చేయకపోవడం వలన అక్కడ నుండి ఫైనల్ కాపీలు ఇంకా రావాల్సి ఉందని, దాని వలన సినిమా రిలీజ్ కి ఎఫెక్ట్ కి మరో కారణం కాబోతుందని అంటున్నారు, ఇక వీటికి మించి ఇప్పుడు జూన్ 12న సినిమాను రిలీజ్ చేయకపొతే…
అమెజాన్ ప్రైమ్ తో చేసిన డీల్ నుండి అమౌంట్ ని మరింతగా తగ్గించే పరిస్థితి నెలకొంది…దాంతో సినిమా రిలీజ్ టైం లో దెబ్బ మీద దెబ్బ పడబోతుంది…రిలీజ్ కి ఇంకా 8 రోజుల టైం ఉండగా ఎంత త్వరగా పరిస్థితులను సెట్ చేయాలనీ చూసినా కూడా…
సినిమా సజావుగా రిలీజ్ ను దక్కించుకోవడం కొంత కష్టమే అని అంటున్నారు ఇప్పుడు. దాంతో మళ్ళీ కొత్త డేట్ కి వెతుక్కునే పరిస్థితులు ఏర్పడగా…మరో పక్క టీం అలాగే పవన్ కళ్యాణ్ స్వయంగా సినిమా రిలీజ్ సజావుగా జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి సినిమా జూన్ 12న వస్తుందా లేక పోస్ట్ పోన్ కన్ఫామా అన్నది ఇవాలో రేపో కన్ఫాం కాబోతుంది…