Home Uncategorized 6 ఏళ్లు అయినా ఫస్ట్ హిట్ కోసం వెయిటింగ్…అయినా ఏజెంట్ కి ఈ రేంజ్ బడ్జెట్...

6 ఏళ్లు అయినా ఫస్ట్ హిట్ కోసం వెయిటింగ్…అయినా ఏజెంట్ కి ఈ రేంజ్ బడ్జెట్ ఏంటి…మెంటల్ మాస్ ఇదీ!

2237
0

కెరీర్ ని 2015 లో మొదలు పెట్టినా ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసిన అక్కినేని అఖిల్ 4 వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేయగా ఈ సినిమా ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకు అన్నీ అనుకున్నట్లు జరిగితే రిలీజ్ కాబోతుంది, ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే సినిమా ఆసక్తిగా మారగా రేసు లో చాలా మంది డైరెక్టర్స్ ఉండగా ఫైనల్ గా ఇప్పుడు సురేందర్ రెడ్డి సీన్ లోకి వచ్చాడు.

కాగా సురేందర్ రెడ్డి తనదగ్గరుకున్న కథలను చాలా మంది హీరోలకు వినిపించినప్పటికీ ఫైనల్ గా అఖిల్ యెస్ చెప్పడం తో ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలి అనుకున్నారు. సురేందర్ రెడ్డి ముందు ఈ సినిమా ను వరుణ్ తేజ్ తో అనుకోగా క్రిష్ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది.

కానీ వరుణ్ తేజ్ కమిట్ అయిన మూవీస్ వల్ల తప్పుకోగా సురేందర్ రెడ్డి ప్లాన్ మార్చుకుని అఖిల్ తో సినిమా కమిట్ అయ్యాడు…. సినిమా అల్ట్రా స్టైలిష్ గా ఉండబోతుందని ఆల్ రెడీ చెప్పిన సురేందర్ రెడ్డి అఖిల్ ని ఇప్పటి వరకు ఇతర డైరెక్టర్స్ చూపెట్టని మాస్ యాంగిల్ లో చూపెట్టబోతున్నాడు….

ఇక ఈ సినిమా కి ఏజెంట్ టైటిల్ పెట్టినప్పటి నుండి హైప్ భారీగా పెరిగి పోగా సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ బడ్జెట్ లో అల్ట్రా స్టైలిష్ గా రూపొందుతుందని సమాచారం…

ఈ రేంజ్ బడ్జెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ ఇంకా కొట్టి జోరు చూపాల్సి ఉన్నా కానీ పెట్టడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి, సినిమా కథ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న టీం సినిమా బడ్జెట్ కి తగ్గట్లు సాలిడ్ బిజినెస్ చేస్తుందన్న నమ్మకం తో ఉన్నారు, అఖిల్ కూడా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టి ఈ సినిమా తో తన రేంజ్ మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here