Home న్యూస్ బ్లాక్ బస్టర్ ఏజెంట్…ఇంకో రెండు కేసులు సాల్వ్ చేయాలట!

బ్లాక్ బస్టర్ ఏజెంట్…ఇంకో రెండు కేసులు సాల్వ్ చేయాలట!

530
0

టాలీవుడ్ లో ఇన్వెస్టిగేషన్ క్రైం థ్రిల్లర్ మూవీస్ పెద్దగా హిట్ అవ్వాలేదు… ఎంత పెద్ద స్టార్ కాస్ట్ తో వచ్చినా కానీ కొన్ని సినిమాలు మాత్రమె పర్వాలేదు అనిపించగా… బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా గా పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుని క్రైం థ్రిల్లర్ మూవీస్ అండ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ లో ఆడియన్స్ ని బాగా మెప్పించిన సినిమాగా లాస్ట్ ఇయర్ వచ్చిన….

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అందరి మెప్పును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చిన్న సినిమానే అయినా ఆడియన్స్ ఏమాత్రం వంక పెట్టలేని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ కి కూడా సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

దాంతో ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ బ్రాండ్ వాల్యూ మరింత పెరగగా రీసెంట్ గా సినిమా నిర్మాతలు ఈ సినిమా ఒక్క సినిమా తోనే అయిపోలేదని… ఈ సినిమా కి తెలుగు లో మరో రెండు సీక్వెల్స్ బాలెన్స్ ఉన్నాయని కన్ఫాం చేశారు.

అంటే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లో ఒక కేస్ సాల్వ్ చేసిన నవిన్ పోలిశెట్టి ఇప్పుడు మరో రెండు కేసులను సాల్వ్ చేసి ఈ బ్రాండ్ ని మరింత పెంచబోతున్నాడన్నమాట. ఈ రెండు సినిమాలు కూడా మొదటి సినిమాలా లిమిటెడ్ బడ్జెట్ లో కాకుండా ఇప్పుడు సినిమాకి ఏర్పడిన క్రేజ్ దృశ్యా మంచి బడ్జెట్ తో క్వాలిటీ బాగా ఉండేలా చూసుకుంటామని అంటున్నారు.

కాగా స్క్రిప్ట్ వరకు సెకెండ్ పార్ట్ కి ఆల్ మోస్ట్ పూర్తీ కావోస్తుందని, ఈ ఇయర్ ఎండ్ సమయానికి అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా సీక్వెల్ మొదలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రెండు సీక్వెల్స్ కూడా మొదటి పార్ట్ కి డబుల్ ట్రిబుల్ విజయాలుగా నిలవాలని మనమూ కోరుకుందాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here