లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో రిలీజ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ… నివిన్ పోలిశెట్టి హీరోగా లాంచ్ అయిన మొదటి సినిమా ఎప్పుడో షూట్ కంప్లీట్ చేసుకున్నా ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయినా అద్బుతమైన పాజిటివ్ రివ్యూ లను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
సినిమా బడ్జెట్ కేవలం 1.3 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టీసర్ ట్రైలర్ సూపర్ హిట్ అవ్వడం తో 4 కోట్ల మేర బిజినెస్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి సినిమా 5.73 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసి…
సూపర్ హిట్ అనిపించుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే విజయాన్ని అందుకున్న సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా రీమేక్ రైట్స్ సాలిడ్ గా 2 కోట్ల మేర పలికిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ గట్టిగా వినిపిస్తుంది.
అంటే సినిమా బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ రేటు ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ మధ్య బాలీవుడ్ వాళ్ళు వరుస పెట్టి సౌత్ మూవీస్ ని రీమేక్ చేసే పనిలో పడగా టాలీవుడ్ నుండే సుమారు 5 సినిమాలు ఒకటి తర్వాత ఒకటి అక్కడ రీమేక్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ లిస్టులో ఎంటర్ అయింది.
కాగా టాలీవుడ్ లో చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమా ను బాలీవుడ్ లో మాత్రం ఓ స్టార్ తో భారీ లెవల్ లో ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మరి హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంచి స్టార్ కాస్ట్ తో తీస్తే కచ్చితంగా ఈ సినిమా అక్కడ సెన్సేషన్ ని క్రియేట్ చేయడం పక్కా అని చెప్పాలి….