బాక్స్ ఆఫీస్ దగ్గర తేజ డైరెక్షన్ లో అభిరాం దగ్గుబాటి హీరోగా లాంచ్ అయిన మూవీ అహింస రీసెంట్ గా రిలీజ్ అయింది. సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యి సోలో రిలీజ్ కి ట్రై చేయగా రీసెంట్ గా మరో మూవీతో పోటిలోనే రిలీజ్ అయినా కూడా రెండు సినిమాలకు మిక్సుడ్ రెస్పాన్సే సొంతం చేసుకుంది ఇప్పుడు…
సినిమాను మొత్తం మీద 4 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించగా డిలే ఖర్చులు అలాగే పబ్లిసిటీ ఖర్చులతో కలిపి సినిమా కి 5 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కినట్లు సమాచారం. ఇక సినిమా మొత్తం మీద నాన్ థియేట్రికల్ రైట్స్ అయితే సోల్డ్ ఔట్ అవ్వలేదని సమాచారం.
దాంతో సినిమాను అమెజాన్ ప్రైమ్ లో వ్యూస్ ని బట్టి వీక్లీ పెయిమెంట్ తో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ లాంటివి ఇంకా అమ్ముడు పోలేదని తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అనుకున్న విధంగా వస్తే ఈ రైట్స్ కి ఎంతో కొంత…
మంచి రేటు సొంతం అయ్యే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తేలిపోవడంతో ఇక ఈ రైట్స్ అనుకున్న రేంజ్ రేటు సొంతం అయ్యే అవకాశం లేనట్టే అని చెప్పాలి. మొత్తం మీద బడ్జెట్ చిన్నదే అవ్వడంతో పెద్దగా నష్టాలు లేవు కానీ ఓవరాల్ గా నష్టాలు అయితే కన్ఫాం అనే చెప్పాలి.