కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీతో రీసెంట్ గా వచ్చి అనుకున్న అంచనాలను అందుకుని మాస్ రచ్చ చేయగా….లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ రీసెంట్ గా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది.
9 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన ఈ సినిమా 10వ రోజున సాధించిన కలెక్షన్స్ తో 210 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేయగా….ఇప్పుడు అజిత్ కుమార్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.
ఇది వరకు 2019 టైంలో అజిత్ కుమార్ విశ్వాసం సినిమాతో 195 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు. రెండేళ్ళ క్రితం వచ్చిన అజిత్ కుమార్ తునివు మూవీ..
టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని కుమ్మేయగా షేర్ పరంగా 103 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని తన కెరీర్ బెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో తునివు షేర్ రికార్డ్ ను గ్రాస్ ను ఆల్ రెడీ బ్రేక్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ కెరీర్ బెస్ట్ రికార్డ్ ను నమోదు చేసి దుమ్ము దుమారం లేపింది…ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో జోరుని చూపిస్తుందో చూడాలి.