Home న్యూస్ అజిత్ కుమార్ పట్టుదల టోటల్ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!

అజిత్ కుమార్ పట్టుదల టోటల్ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!

0

కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయ‌ర్చి(Vidaamuyarchi) మూవీ పెద్దగా క్రేజ్ ను అయితే సొంతం చేసుకోలేక పోయినా కూడా జస్ట్ అజిత్ కుమార్ క్రేజ్ పవర్ తో ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా కుమ్మేయగా…

బిజినెస్ పరంగా కూడా సినిమా అన్ని చోట్లా అజిత్ మాస్ పవర్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. తెలుగు లో పట్టుదల పేరుతో డబ్ అయ్యి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ కానుండగా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ ఇక్కడ..

2.7 కోట్ల దాకా ఉంటుందని అంచనా…ఈ లెక్కన సినిమా ఇక్కడ డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అన్నా కూడా 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా….ఇక తమిళనాడులో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 65 కోట్ల దాకా ఉంటుందని అంచనా…

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద తెలుగుతో కలిపి సినిమా కి 75 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…ఇక ఓవర్సీస్ లో సినిమా 16 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ఉండగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా 91 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…

అజిత్ కుమార్ ప్రీవియస్ మూవీ తెగింపు 84 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది. ఆ సినిమా తో పోల్చితే అసలు బజ్ పెద్దగా ఏమి లేక పోయినా కూడా ఈ సినిమా కి వాల్యూ బిజినెస్ బాగానే జరగగా సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే 92 కోట్ల రేంజ్ లో షేర్ ని 185 కోట్ల లోపు గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here