Home న్యూస్ సౌత్ రికార్డులను బ్రేక్ చేసిన అజిత్…RRR కూడా కొట్టని రికార్డ్ ఇది!

సౌత్ రికార్డులను బ్రేక్ చేసిన అజిత్…RRR కూడా కొట్టని రికార్డ్ ఇది!

3540
0

మన దగ్గరంటే స్టార్ హీరోల కౌంట్ ఎక్కువ కాబట్టి యూట్యూబ్ రికార్డుల పరంగా మన వాళ్ళు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందని, కానీ కోలివుడ్ లో మాత్రం ఇలా కాదు, అక్కడ రజినీ, కమల్ లు సీనియర్స్, వాళ్ళ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్నది మాత్రం విజయ్ మరియు అజిత్ ల సినిమాలకే… అయితే విజయ్ ఫ్యాన్ అంటారు లేదా అజిత్ ఫ్యాన్ అంటారు… కాబట్టి రికార్డుల విషయం లో పోటి ఈ ఇద్దరి మధ్యే ఉంటుంది…

ఒకరు ఒక రికార్డ్ కొడితే మరొకరు ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తారు… వీళ్ళ రికార్డులు టాలీవుడ్ స్టార్స్ యూట్యూబ్ రికార్డుల కన్నా భారీగా లీడ్ తో ఉండటానికి మెయిన్ రీజన్ ఇదే… లేటెస్ట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని స్పెషల్ మ్యూజిక్ వీడియోని వివిధ భాషల్లో రిలీజ్ చేశారు.

కానీ సింగిల్ లాంగ్వేజ్ పరంగా ఒక్క లైక్స్ పరంగా కొత్త రికార్డులు నమోదు అయినా వ్యూస్ పరంగా రికార్డులు ఏమి నమోదు కాలేదు. అదే టైం లో రీసెంట్ గా కోలివుడ్ స్టార్ అజిత్ నటించిన వలిమై సినిమాలోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

కాగా సాంగ్ 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ రికార్డ్ ను సొంతం చేసుకోగా వ్యూస్ రికార్డ్ ను ఆల్ మోస్ట్ టచ్ చేసింది. వ్యూస్ పరంగా 8.17 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సాంగ్ లైక్స్ పరంగా 1.07 మిలియన్ లైక్స్ ని 24 గంటల్లో సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగా విజయ్ మాస్టర్ సినిమాలోని కుట్టి స్టొరీ సాంగ్ 8.26 మిలియన్స్ తో టాప్ లో ఉంది…

కానీ లైక్స్ విషయంలో 1.004 మిలియన్ లైక్స్ ని బ్రేక్ చేసిన అజిత్ సినిమా సాంగ్ 1.04 మిలియన్స్ ని అందుకుంది. వ్యూస్ రికార్డ్ మన వాళ్ళు ట్రై చేస్తే సింగిల్ లాంగ్వేజ్ తోనే అందుకోవచ్చు కానీ లైక్స్ మట్టుకు చాలా కష్టం అని చెప్పాలి. ఇక సినిమాలో తర్వాత సాంగ్స్ తో కొత్త రికార్డులను కచ్చితంగా నమోదు చేస్తామంటూ అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ధీమా తో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here