బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఫిబ్రవరి లో ఆడియన్స్ ముందుకు కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar)నటించిన విదామయుర్చి(VidaaMuyarchi) మూవీ రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా కేవలం అజిత్ స్టార్ పవర్ తోనే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
తర్వాత డీసెంట్ లెవల్ లో లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుంది అని చెప్పాలి కానీ అదే టైంలో ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ వాల్యూ టార్గెట్ ను మాత్రం అందుకోవడంలో సినిమా విఫలం అయ్యింది అని చెప్పాలి. సినిమా తెలుగు లో పట్టుదల పేరుతో డబ్ అవ్వగా…
3 కోట్ల వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 1.02 కోట్ల షేర్ ని 2.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.98 కోట్ల రేంజ్ లో లాస్ ను అందుకుని ఇక్కడ డిసాస్టర్ గా నిలిచింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రన్ కంప్లీట్ అయ్యే టైంకి…
సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
VidaaMuyarchi-Pattudala Total WW Collections Approx
👉Tamilnadu – 80.65Cr
👉Telugu States – 2.40Cr
👉Karnataka – 10.30Cr
👉Kerala – 3.55Cr
👉ROI – 1.25Cr
👉Overseas – 45.00Cr***approx
Total WW collection – 143.15CR(69.80CR~ Share) Approx
(76%~ RECOVERY)
ఓవరాల్ గా 92 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి 76% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా ఓవరాల్ గా 22.2 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని ఫ్లాఫ్ గా పరుగును పూర్తి చేసుకుంది. కొంచం బెటర్ కంటెంట్ అండ్ ప్రమోషన్స్ జరిగి ఉంటే సినిమా రికవరీ ఇంకా బెటర్ గా ఉండేదని చెప్పొచ్చు.