మాములు చిన్న సినిమాలనే ఓ రేంజ్ లో ప్రమోట్ చేసి అప్ డేట్స్ ఇవ్వాలని చూస్తారు, ఇక హైప్ ఉన్న స్టార్స్ నటించే సినిమాలకు అప్ డేట్స్ విషయంలో..అప్ డేట్ కోసం ఒక అప్ డేట్…ఆ అప్ డేట్ వచ్చిన తర్వాత తర్వాత అప్ డేట్ లో అనౌన్స్ మెంట్…ఆ తర్వాత అసలు అప్ డేట్ ఉంటుంది….కానీ ఇప్పుడు జరిగింది బహుశా ఇప్పటి వరకు జరగంది అని చెప్పాలి.
కోలివుడ్ లో టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) తమిళనాడులో దళపతి విజయ్(Thalapathy Vijay) తర్వాత బిగ్ స్టార్…ఒకప్పుడు ఇద్దరూ పోటా పోటిగా దుమ్ము లేపేవాళ్ళు కానీ ఇప్పుడు విజయ్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతున్నాడు..
అజిత్ నుండి మాత్రం ఫ్యాన్స్ కోరుకునే సినిమాలు రావడం లేదు…ప్రస్తుతం అజిత్ చేస్తున్న 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ఒకటి గుడ్ బ్యాడ్ అగ్లీ… మరోటి విడాముయర్చి(Vidaamuyarchi) మూవీ…ఈ సినిమాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ…
చివరి నిమిషంలో వెనకడుగు వేశారు…కానీ సడెన్ గా ఆ సినిమా ప్లేస్ లో విడాముయర్చి రిలీజ్ ని అనౌన్స్ చేశారు..అజిత్ సినిమా అంటే పెద్దగా ప్రమోషన్స్ లాంటివి ఉండవు కానీ కనీసం టీసర్ కి అయినా ఎదో ఒక అప్ డేట్ తో టీసర్ ను రిలీజ్ చేస్తారు…
కానీ ఈ సినిమా అఫీషియల్ టీసర్ ను నవంబర్ 28న రాత్రి 11 గంటల 08 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నామని 17 నిమిషాల ముందు అంటే 10 గంటల 51 నిమిషాలకు అప్ డేట్ చేసి టీసర్ ను రిలీజ్ చేశారు…ఒక టాప్ స్టార్ మూవీ టీసర్ రాత్రి టైంలో ఇలా రిలీజ్ కి కొన్ని నిమిషాల ముందు…
చిన్న అప్ డేట్ తో రిలీజ్ చేయడం రీసెంట్ టైంలో బహుశా ఏ టాప్ స్టార్ విషయంలో కూడా జరగలేదు….ఆ రిలీజ్ చేసిన టీసర్ ఏమైనా అద్బుతంగా ఉందా అంటే…డైలాగ్స్ ఏమి లేకుండా ఏవేవో షాట్స్ తో టీసర్ ను చుట్టేసి రిలీజ్ చేసినట్లు అనిపిస్తుంది…
అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు కాబట్టి బ్యాగ్రౌండ్ స్కోర్ ఏమైనా కుమ్మిందా అనుకుంటే అది కూడా పెద్దగా ఏమి లేదు….ఓవరాల్ గా టాప్ స్టార్ మూవీ కంటెంట్ ప్రస్తుతానికి టీసర్ లో ఏం కనిపించడం లేదు, మేకర్స్ సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు కూడా ఏం బాలేదు అంటూ ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు..ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా అయినా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి ఇప్పుడు.