Home న్యూస్ నా సినిమానే మళ్ళీ తీశాడు…పూరీ పై “ఆకాష్” షాకింగ్ కామెంట్స్!!

నా సినిమానే మళ్ళీ తీశాడు…పూరీ పై “ఆకాష్” షాకింగ్ కామెంట్స్!!

2167
1

బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో ఏలుతున్న ఇస్మార్ట్ శంకర్ పై రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి వివాదం ఇప్పటి వరకు రాలేదు ఏంటి అంటూ అందరూ అనుకుంటున్న సమయం లో సినిమా కథ పై హీరో ఆకాష్ షాకింగ్ కామెంట్స్ తో ఒక్కసారిగా మంట లేపాడు. నిజానిజాలు ఏంటి అనేవి పక్కకు పెడితే ఆకాష్ చెప్పిన విధంగా కొన్ని పాయింట్స్ టచ్ అవుతుండటం తో పూరీ పై ఇప్పుడు కాపీ అభియోగం గట్టిదవుతుంది.

తాను తమిళ్ లో తీసిన సినిమాను తెలుగు లో మళ్ళీ ఫ్రెష్ గా రీమేక్ చేద్దాం అనుకుంటున్న సమయం లో పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ చూసి షాక్ అయ్యాయని, అది నా కథే అంటూ కామెంట్స్ చేశాడు ఆకాష్, ఈ విషయం పూరీ కి చెప్పి సైలెంట్ గా ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా…

మాట్లాడుకుందామని అనుకున్నా పూరీ జగన్నాథ్ అస్సలు స్పందించక పోవడం ఇప్పుడు ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్. ఒకసారి ఆకాష్ చెప్పిన మాటలు విని ఆకాష్ తీసిన సినిమా తెలుగు ట్రైలర్ ని పరిశీలించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here