బాక్స్ ఆఫీస్ దగ్గర ఆంధ్రలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని చెప్పొచ్చు. డిసెంబర్ నెలలో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అఖండ మరియు పుష్ప సినిమాలు చప్పగా సాగుతున్న టాలీవుడ్ జోరుని ఓ రేంజ్ లో పెంచాయి కానీ ఆంధ్రలో లో టికెట్ రేట్ల గొడవ, థియేటర్స్ మూసెయ్యడం లాంటివి పుష్ప కి 6 వ రోజు కలెక్షన్స్ పరంగా ఇబ్బంది ఎక్కువగా పెట్టాయి. అదే టైం లో…
సినిమా టాక్ కూడా ఇంపాక్ట్ చూపింది అనే చెప్పాలి. అన్నీ ఎఫెక్ట్ అయ్యి 6 వ రోజు సినిమా 2.08 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకోగా మరీ ఈ సినిమా లెవల్ లో కాకున్నా లో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ ని ఫేస్ చేసిన అఖండ సినిమా 6 వ రోజు తెలుగు రాష్ట్రాలలో…
2.53 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది…. కానీ పుష్ప కి నైజాంలో అఖండ కన్నా ఎక్కువ టికెట్ హైక్స్ ఉన్నాయి. ఓవరాల్ గా పుష్ప టాక్ అండ్ 6 వ రోజు సడెన్ ఎదురుదెబ్బల వలన అఖండ 6 వ రోజు కన్నా తక్కువ వసూళ్లు సాధించింది. మిగిలిన రోజుల మాదిరిగా ఉంటే సినిమా 2.3-2.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునేది… అయినా కానీ కంబ్యాక్ మూవీ తో బాలయ్య రాంపేజ్ చూపెట్టాడు అనే చెప్పాలి.