Home న్యూస్ నైజాం గడ్డపై 300….ఇక దంచికొట్టుడు ఖాయం!

నైజాం గడ్డపై 300….ఇక దంచికొట్టుడు ఖాయం!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ. బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళ కాంబోలో హాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమా పై అంచనాలు అయితే సాలిడ్ గానే ఉండగా రీసెంట్ గా సినిమా ట్రైలర్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ రావడమే కాదు బిజినెస్ కూడా ఫుల్ ఓ రేంజ్ లో జరుగుతూ ఉండగా సినిమా కి ఒక్కో ఏరియాలో బిజినెస్ అండ్ థియేటర్స్ హోల్డ్ కూడా…

సాలిడ్ గా జరుగుతూ ఉంది, సినిమా ఇప్పుడు నైజాం ఏరియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాగే దసరా నుండి పెద్దగా తెలుగు లో నోటబుల్ మూవీస్ ఏవి కూడా…

ఆడియన్స్ ముందుకు రాక పోవడంతో ఈ సినిమాను ఇప్పుడు నైజాంలో భారీగా రిలీజ్ చేయబోతున్నారు. మినిమమ్ లో మినిమమ్ 260 థియేటర్స్ లో… రిలీజ్ రోజుకి ఫైనల్ లెక్క 280 నుండి 300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందట. ఈ లెక్కన నైజాంలో సినిమా మాస్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here