Home న్యూస్ టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 4….ఈ రేంజ్ రచ్చ ఏంటి సామి!!

టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 4….ఈ రేంజ్ రచ్చ ఏంటి సామి!!

2072
0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ టైటిల్ అనౌన్స్ మెంట్ లో భాగంగా రిలీజ్ చేసిన టీసర్ రిలీజ్ అయినప్పటి నుండి వార్తల్లో నిలుస్తూ వస్తూనే ఉంది… ఈ క్రమం లో సినిమా టీసర్ అనేక రికార్డులను కూడా సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అనే చెప్పాలి. రీసెంట్ గా టాలీవుడ్ లో సీనియర్ హీరోల టీసర్ ల పరంగా హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకోగా…

తర్వాత సౌత్ లో కూడా సీనియర్ హీరోల టీసర్ ల వ్యూస్ లిస్టులో చోటు సొంతం చేసుకోవడం, కొన్ని రోజులకే ఏకంగా టాప్ ప్లేసును సైతం సొంతం చేసుకోవడం మామూలు రచ్చ చేయలేదు ఈ టీసర్.. సౌత్ లో టీసర్ ల పరంగా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకున్న తర్వాత…

ఇక ఇప్పుడు టాలీవుడ్ తరుపున హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ లలో ఒకటిగా చేరిన అఖండ టీసర్ రీసెంట్ గా 40 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని అధిగమించి ఫస్ట్ టైం ఒక సీనియర్ హీరో సినిమా టీసర్ 40 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న రికార్డ్ ను…

ఇప్పుడు సొంతం చేసుకుని రచ్చ చేయగా టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ లలో టాప్ 4 ప్లేసును ఇప్పుడు సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఒకసారి ఆ లిస్టు ను గమనిస్తే…
👉#RamarajuForBheem – 50.27M
👉#Pushpa -47.38M
👉#BheemforRamaraju – 43.92M
👉#Akhanda – 40.67M****
👉#SarileruNeekevvaru – 33.80M
ఇలా దుమ్ము దుమారం లేపుతూ ప్రస్తుతం టాప్ 4 ప్లేసులో ఉన్న అఖండ టీసర్…

ఇదే ఊపుని కొనసాగిస్తే మూడో ప్లేసు కి అతి త్వరగా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక తర్వాత కూడా స్పీడ్ మెయిన్ టైన్ చేస్తే టాప్ 2 లేదా ఏకంగా టాప్ ప్లేసునే సొంతం చేసుకున్నా ఆశ్యర్య పోనవసరం లేదని చెప్పొచ్చు. మరి టీసర్ ఎన్ని రోజుల్లో ఈ రికార్డులను కూడా సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here